Allu Arjun Emotional: సుకుమార్...నువ్వు లేకపోతే నా కెరీర్, లైఫ్ లేదు..బన్నీ ఎమోషనల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. సుకుమార్ అయితే బన్నీ మాటలకు ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. టెక్నీషియన్స్ ను బన్నీ అప్రిషియేట్ చేయడం ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది. ఇక తన దర్శకుడు సుకుమార్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు బన్నీ. ఆయన మాట్లాడుతూ.. ''పర్సనల్ విషయాలను పబ్లిక్ గా షేర్ చేయలేం. సుకుమార్ నాకు అంత పెర్సనల్. కానీ సుకుమార్ గారేంటో ప్రపంచానికి తెలియాలి. నా లైఫ్ సుకుమార్ గారు లేకపోతే వేరేలా ఉండేది.. ఎక్కువచేసి ఏం చెప్పడం లేదు. నా కెరీర్ ఐకాన్ స్టార్ వరకు వెళ్లిందంటే దానికి కారణం సుకుమార్ గారే. నేను 'పరుగు' సినిమా చేస్తోన్న సమయంలో ఒక కాస్ట్లీ కారు కొనుక్కున్నాను. దాని వాల్యూ రూ.85 లక్షలు. స్పోర్ట్స్ కార్ అదిరిపోద్ది అంతే. దాని స్టీరింగ్ మీద చేయి వేసి.. నేను ఇంత దూరం రావడానికి కారణం ఎవరని ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చింది సుకుమార్ గారే. డార్లింగ్ నువ్ లేకపోతే నేను లేను'' అంటూ ఎమోషనల్ గా చెప్పారు అల్లు అర్జున్. వెంటనే సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 'నన్ను స్టార్ ని చేసి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేలా చేశావ్.. నీ కాంట్రిబ్యూషన్ ఎంతో నేను మాటల్లో చెప్పలేను' అంటూ సుకుమార్ గురించి గొప్పగా మాట్లాడారు బన్నీ.