Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో ఉన్నారిప్పుడు. శనివారం రాత్రి సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో జాయినయ్యారు. అయితే... ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అసలు, కైకాలకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
ఐదు రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో జారిపడ్డారు. పెద్దగా గాయాలు ఏమీ కాలేదు. అయితే, నొప్పులు ఉన్నాయట. శనివారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో కైకాల చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు అంతా బావుందని, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు.





















