థియేటర్లు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
థియేటర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, ఎపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్.వి.ప్రసాద్. పని ఒత్తిడిలో ఉన్న జెసిలను కలిసి విన్నవించుకుంటే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. నెల సమయమివ్వడం సంతోషమేనని.. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్ల పరిస్థితి మరింత ఘోరంగా తయారైందన్నారు.. కరోనాతో రెండేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డామని..ఓటీటీ కారణంగా సినీపరిశ్రమ నష్టాలకు మరో కారణమన్నారు. కమిటీ కాలయాపన చేయకుండా మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎవరు పడితే వారు సినీపరిశ్రమ గురించి మాట్లాడవద్దన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారని..హీరోలు మా సమస్యలపై స్పందించడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. నట్టి కుమార్ ను తెలంగాణాలో ప్రత్యేక ఛాంబర్ ను పెట్టుకోమనండంటూ మండిపడ్డారు. మాతో సంబంధం లేకుంటే ఎన్నికలు మీరే పెట్టుకోండన్నారు. థియేటర్లలో టిక్కెట్ల రేట్లపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఎన్వీ ప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత,ఏపి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు.