Akhanda 2 Thaandavam Blasting Roar | అఖండ 2 సినిమా NBK నుంచి బ్లాస్టింగ్ రోర్ వదిలిన బోయపాటి | ABP Desam
అఖండ 2 సినిమా నుంచి బ్లాస్టింగ్ రోర్ వచ్చింది. డైరెక్టర్ బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయ్యిన అఖండ కు సీక్వెల్ గా రూపొందిన ఆఖండ 2 తాండవం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. అఖండ గెటప్ లో ఇప్పటికే ఓ టీజర్ రిలీజ్ కాగా... ఇది బాలకృష్ణ మురళీకృష్ణ గెటప్ కు సంబంధించిన టీజర్. బాలయ్య ఫైట్ చేస్తున్నట్లు ఉన్న టీజర్ లో వినిపించిన డైలాగ్...పార్ట్ 2 లో బాలయ్య రోరింగ్ ఎలా ఉండనుందో చెబుతోంది. విలన్ కి వార్నింగ్ ఇస్తూ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో..దేనికి నవ్వుతానో...దేనికి నరుకుతానో నాక్కూడా తెలియదు కొడకా...ఊహకు కూడా అందదు అంటూ బాలయ్య చెబుతున్న డైలాగ్స్ మాస్ కి విజిల్స్...విలన్స్ కి పగుల్స్ అన్నట్లుంది. ఎస్ ఎస్ థమన్ పూనకాల మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలలో విడుదల కానుంది. చూడాలి అఖండ తరహాలోనే అఖండ తాండవం కూడా థియేటర్స్ ను షేక్ చేస్తుందేమో





















