Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!
Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie | గుర్తున్నాడా..! ఈ కొరియన్ యాక్టర్..! ఇలాంటి ఓ యాక్టర్ ప్రభాస్ తో ఢీ కొడితే ఎలా ఉంటుంది. అది కూడా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో..! ప్రస్తుతం కల్కీ సక్సెస్ తో ప్రభాస్ ఊపుమీద ఉన్నాడు. ఐతే.. బాహుబాలి-2 తరువాత ప్రభాస్ కు ఓ మాస్ సినిమా పడలేదు. సలార్ పడినప్పటికీ.. అది ఊహించిన స్థాయిలో ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. ఈ తరుణంలో.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో మాస్ కి మరి ముఖ్యంగా యూత్ కి క్రేజీ డైరెక్టర్ గా మారాడు సందీప్ రెడ్డి వంగా. సో.. నెక్ట్స్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ తో రాబోతున్న స్పిరిట్ మూవీ మీదే అందరి కళ్లు పడ్డాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కొరియన్ నటుడు మా డాంగ్ సూక్ విలన్ గా నటించనున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ యాక్టర్ ను ఓప్పించడానికి...సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే.. థీయేటర్లు తగలబడపోతాయి. ఎందుకంటే.. ఈ యాక్టర్ మాములోడు కాదు.. కావాలంటే సోషల్ మీడియాలో కొన్ని షాట్స్ చూడండి. మనోడి స్క్రీన్ ప్రజెన్స్, స్వాగ్ వేరే లెవల్ ఉంటుంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో కావాలంటే కొన్ని సినిమాలు చూడండి..! ఎలాగో..యానిమల్ బాబీ డియోల్ ను సూపర్ గా చూపించిన వంగా..ఇంటర్నేషనల్ స్టార్ ను ఇంకే రేంజ్ లో చూపిస్తాడో ఊహించుకుంటూంటేనే పిచ్చెక్కుతుంది. కల్కీ సినిమాతో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్..స్పిరిట్ సినిమాతో హాలివుడ్, కొరియన్ ఇండస్ట్రీల్లోనూ జెండా పాతాలని ఫ్యాన్స్ కోరుకంటున్నారు.