Attack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ ను కత్తి పెట్టి పొడిచినట్లు తెలుస్తోంది. సైఫ్ ను ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సైఫ్ పై దాడి జరిగింది సుమారు గా 2-2.30 గంటల ప్రాంతంలో అని భావిస్తున్నారు. దుండగుడు ఇంట్లోకి చొరబడి తన పనిమనిషితో గొడవ పడుతుండగా మధ్యలో సైఫ్ వెళ్లి అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ పైకి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పనిమనిషి తో గొడవపడేందుకు వచ్చాడా లేదా సైఫ్ పై ఎవరైనా హత్యాయత్నం చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ఆయన భార్య కరీనా కపూర్, పిల్లలు అక్కడ లేరు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఉన్న సైఫ్ అలీఖాన్..పటౌడీ ల కుటుంబానికి ఇప్పుడు పెద్దగా ఉన్నారు. దేవర సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ కి విలన్ గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో.





















