Vizag Helicopter Museum Vlog | విపత్తుల్లో నేవీ ధైర్య సాహసాలు తెలియాంటే ఈ మ్యూజియం చూడాల్సిందే | ABP
వైజాగ్ బీచ్(Vizag Beach) లో టూరిజం ఎట్రాక్షన్ లు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా నేవీ(Indian Navy) లో 17 సంవత్సరాలు సేవలు అందించిన భారీ హెలికాప్టర్ ను మ్యూజియం గా మార్చారు. అందరికీ అందుబాటులో ఉండేలా దీనికి ఒక కాంబో ఎంట్రీ టికెట్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే వైజాగ్ బీచ్ లో మ్యూజియంలుగా మార్చిన సబ్ మెరైన్, TU-142 పెద్ద విమానం, సీ హారియర్ ఫ్లైట్ లతో హెలికాప్టర్ మ్యూజియం(Helicopter Museum) లకు ఓకే టికెట్ 200/-గా నిర్దారించారు. అంటే వీటిలో దేని టికెట్ కొన్నా ఆ మ్యూజియంతో పాటు మిగిలిన మూడు మ్యూజియం లనూ చూడొచ్చు. పక్కపక్కనే ఉండే ఈ నాలుగు మ్యూజియం లనూ ఒకే టికెట్ తో చూసే అవకాశం ఉండడం వల్ల టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది అని VMRDA భావిస్తోంది. పర్యాటకులకు ఓ వైపు వినోదం మరో వైపు భారత త్రివిధ దళాలలో విధులు నిర్వహించిన హెలికాఫ్టర్లు, సబ్ మెరైన్లు గురించి తెలుసుకునే అరుదైన అవకాశం ఈ పర్యాటక మ్యూజియం వల్ల కలగనుంది.





















