తిరుమలలో ఉచిత బస్సు, అదే ధర్మరథం చోరీకి గురైంది. ఆ బస్సును నాయుడుపేట బిరదవాడ వద్ద గుర్తించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే.... గుర్తుతెలియని కొందరు దుండగులు ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని టీటీడీ డిపోలో ఉంచిన ఉచితబస్సును ఎత్తుకెళ్ళారు. ఇవాళ ఉదయం డిపోలో బస్సు లేదని గుర్తించిన సిబ్బంది... తిరుమలలోని అన్ని ప్రాంతాలను తనిఖీ చేసి, బస్సు చోరీకి గురైనట్టు నిర్ధరణకు వచ్చి తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.... జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలు గుర్తించారు. నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద బస్సు ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు విలువ చాలా ఖరీదైనది. దీన్ని ఎత్తుకొచ్చిన నిందితులు ఎవరో కనిపెట్టేందుకు సమీప ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Srikalahasti Special Palakova : శ్రీకాళహస్తి వస్తే పాలకోవా రుచి చూడాల్సిందే
Minister Roja Photographer Jesus Christ Cross At Tirumala: విజిలెన్స్ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం
Nara Bhuvaneswari At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
Ice Cream Vendor Whistles For Monkeys: తిరుపతిలో ఈయన విజిలేస్తే కోతులు పరిగెత్తుకొస్తాయి..!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>