Tammineni Seetharam :అంబేడ్కర్ వర్థంతి నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం| ABP Desam
నవ భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి , అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి భారత జాతి ఎన్నడూ మరవదు అన్నారు.రిజర్వేషన్లు కల్పన ద్వారా అందరికి సమానత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు తీసుకు వచ్చిన ఘనత అంబేద్కర్ దే అన్నారు.సామాజిక రాజకీయ ఆర్ధిక సంస్కర్తగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న ఘనత అంబేద్కర్ కే దక్కుతుందన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

