Balasore Train Accident | Railway Negligence In Kadiri: కదిరి సమీపంలో తప్పిన భారీ ప్రమాదం
బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ గత కొన్ని దశాబ్దాల్లోనే విషాదకర ఘటన అని దేశమంతా బాధపడుతున్న వేళ.... మన ఆంధ్రప్రదేశ్ లో ఓ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కుటాగుల్ల గేట్ వద్ద రైలు వస్తున్నా.... గేట్ మ్యాన్ అప్రమత్తం కాలేదు. గేటు వేయలేదు. అక్కడ ఉన్న ప్రజల కేకలు విని లోకో పైలట్ అప్రమత్తతో రైలు ఆపేయబట్టి పెనుప్రమాదం తప్పింది. నాగర్ కోయిల్ నుంచి ముంబయి వెళ్తున్న ట్రైన్.... కదిరి నుంచి అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయల్దేరింది. సమీపంలోని కుటాగుల్లా గేట్ వద్ద గేట్ మెన్ లేడు. అందుకే గేట్ వేయలేదు. లోకో పైలట్ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మరో ఘోర ప్రమాదంగా మారి ఉండేది.





















