Pawan Kalyan on Santhana Dharma | సనాతన ధర్మం గురించి ఏబీపీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ఏ దేశమైనా ఆ దేశ సంస్కృతిని కాపాడుకోవటం ప్రాథమిక హక్కు. సోషలిజం, మార్క్సిజం లాంటి భావజాలాలు, సిద్ధాంతాలు ఎన్నైనా రావొచ్చు కానీ అక్కడి సంస్కృతిని గౌరవించి తీరాల్సిందే. రష్యాలో కూడా లెనిన్ టైమ్ లో కమ్యూనిజానికి ఆధిపత్యం వచ్చింది. అన్ని మతాలను నిషేధించారు. కానీ సనాతన క్రైస్తవం మళ్లీ అక్కడ పుట్టుకొచ్చింది. జరిగేది అదే. మనం సంస్కృతిని అణిచేయలేం..చంపేయలేం. అందుకే సంస్కృతిని వ్యతిరేకించకూడదు. మా సంస్కృతిని మేం కాపాడుకుంటాం. ఇస్లాం, క్ర్రైస్తవాన్ని నేను గౌరవిస్తా కానీ నా ధర్మాన్ని కాపాడుకుంటా. నేను హిందుత్వానికి కట్టుబడి ఉన్నవాడిని. అంకిత భావంతో ఉన్నా. మా మతాన్ని అవమానించొద్దు. సనాతన ధర్మం మన దేశానికి అవసరం. దానికి సహనం ఎక్కువ. అందుకే ఇన్ని విదేశీ మతాలను చేతులు చాపి మరీ ఆహ్వానించింది మన దేశం. సనాతన ధర్మంపై తన విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన పవన్...ఏ భావజాలమైనా సరే సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిందేనన్నారు.





















