ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కొంచెం రిలీఫ్
ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టిన బోట్లలో ఒకటి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. మొత్తం నాలుగు బోట్లు చిక్కుకోగా పైనుంచి వస్తున్న వరద ఉద్ధృతికి ఓ బోటు గేటు లోపలి నుంచి అటువైపు నదిలోకి వెళ్లిపోయింది. మరింత సమాచారం ఈ వీడియోలో. కృష్ణా జిల్లా విజయవాడలో ఉన్న ఫెర్రీ నుంచి వరద ఉద్దృతికి కొట్టుకువచ్చిన మూడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టడం స్థానికుల్లో ఆందోళనను కలిగిస్తోంది. మూడు పడవల్లో ఒక పడవ బ్యారేజ్‌ను చాలా బలంగా ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ ఏకంగా రెండు ముక్కలైంది. దీంతో బ్యారేజీపైన వాహనాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. చరిత్రలోను మునుపెన్నడూ లేని విధంగా విజయవాడను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సింగ్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తిండి కోసం కూడా బిక్కు బిక్కుమంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెప్తున్నారు.