Deputy CM Pawan Kalyan Entry AP Assembly | ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ | ABP
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. ఏపీ అసెంబ్లీలో చేరుకున్న పవన్ కు జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా శాసనసభలో అడుగు పెట్టారు. పిఠాపురం నుంచి విజయం సాధించిన పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా 2014 పార్టీ పెట్టినా ఇంత వరకు ఆయన విజయం సాధించలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. కానీ 2024లో పిఠాపురం నుంచి పోటీ చేసి దిగ్విజయం సాధించారు. ఎమ్మెల్యేగానే కాకుండా డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ, అటవీ, శాస్త్రసాంకేతిక శాఖలకు మంత్రిగా కూడా నియమితులయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టడం జనసైనికుల్లో సంతోషాన్ని నింపింది.