Snake Bite: ఏపీని భయపెడుతున్న కిల్లర్ స్నేక్స్.. కాటేస్తే ఇలా చేయండి
పాము కాటు వేయగానే చాలామంది భయపడి చనిపోయేవాళ్లే ఎక్కువ. అన్ని పాములు విషపూరితం కాకపోయినా , పాము కాటు కు భయపడి , గుండె వేగం పెరగటం వల్ల , అధిక రక్తప్రసరణ జరిగి మరింత ప్రమాదకరంగా వుంది పరిస్థితి. త్రాచుపాము , రక్తపింజర , కట్లపాము కాటు వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చనిపోతున్నారు. పాము కరవగానే, వాళ్లకు తెలిసిన పసరు వైద్యం చేసి పరిస్థితి విషమించాక హాస్పిటల్స్ కి రావటం వలన ప్రాణ నష్టం ఎక్కువుందనీ,. భయం వలన , వైద్యం అందటం లో ఆలస్యం వలన మరణాలు సంభవిస్తున్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా మూఢనమ్మకాలున్నాయని, పాము కరిచిన వెంటనే వీలైనంత త్వరగా యాంటీ వెనం వేసుకుంటే ప్రమాదం ఉండదని రిటైర్డ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శివ శంకర్ రెడ్డి అంటున్నారు.





















