అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకున్న 24గంటల్లోగా పాదయాత్రను నెల్లూరు జిల్లా పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. పాదయాత్రలో దేవుడి రథంకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయాన్నే నెల్లూరు శివారులోని అంబాపురం శాలివాహన ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర రైతులు బయలుదేరారు. రెండురోజుల విరామం అనంతరం యాత్ర మొదలు పెట్టారు. టెంకాయ కొట్టి పూజలు చేసి అక్కడినుంచి బయలుదేరారు. టీడీపీ నేతలు కూడా వారితో జతకలిశారు. అయితే అంతలోనే పోలీసులు అక్కడికి వచ్చి రైతుల్ని అడ్డుకున్నారు. యాత్రలో దేవిడి రథంకు అనుమతి లేదన్నారు. దీంతో కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. చివరకు రైతులు ముందుగా నడచి వెళ్లేట్లు.. కాస్త గ్యాప్ తీసుకుని ఇతర వాహనాలు వెళ్లేట్లు ఒప్పందం కుదరడంతో రైతులు ముందుకు కదిలారు.
Vangaveeti Nadendla Meet No Clarity : ఈ నెల 4న జనసేనలోకి రాధా..? | ABP Desam
MP Subramanian swamy in Tirupati : పత్రికపై పరువునష్టం దావా కేసు వాయిదా | ABP Desam
Ex Minister Paritala Sunitha : చెన్నేకొత్తపల్లి మండలంలో మాజీ మంత్రి పరిటాల సునీత | ABP Desam
MLA Kodali Nani On Vallabhaneni Vamshi : గన్నవరం ప్లీనరీలో కొడాలి నాని కామెంట్స్ | ABP Desam
Hero Varun Tej Visits Nellore : నెల్లూరులో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్ | ABP Desam
CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
IND vs ENG, 1st Innings Highlights: ఇంగ్లండ్‌పై ‘పంతం’ - మొదటిరోజు భారత్‌దే!
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
Rains in AP Telangana: నేడు ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన - ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD