Island for Own Country: సొంత దేశం ఏర్పాటుకు ఏకంగా దీవినే కొనేసిన ఇద్దరు సామాన్యులు, మీరూ పార్టనర్స్ కావచ్చు!
అడుగు స్థలం కొనడానకే మనకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటింది సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు ఏకంగా ఓ దీవిని కొనేయడమే కాకుండా, దాన్ని సొంత దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిత్యానంద స్వామి తరహాలో మీకు కూడా సొంతంగా ఒక దేశం ఏర్పాటు చేసుకోవాలని ఉందా? డబ్బులు ఉండాలేగానీ.. అదేమీ పెద్ద కష్టం కాదు. జస్ట్ ఒక దీవిని కొనేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఒక దేశంగా ప్రకటించుకుని గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మీరే ప్రెసిడెంట్ లేదా కింగ్ కావచ్చు. అబ్బా, ఊహించుకుంటేనే చాలా థ్రిల్‌గా ఉంది కదూ. కానీ, అదంతా కలలో మాత్రమే సాధ్యం. అయితే, గ్యారెత్ జాన్సన్, మార్షల్ మేయర్ అనే ఇద్దరు స్నేహితులు అది కేవలం కలగా మిగిలిపోకూడదని నిర్ణయించుకున్నారు. ఏకంగా ఓ దివినే కొనేశారు. త్వరలో దాన్ని దేశంగా మార్చేయాలనేది వారి ప్లాన్.
జాన్సన్, మేయర్.. ఇద్దరూ సామాన్య కుటుంబానికి చెందినవారే. ఏదో ఒక రోజు ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వారి లక్ష్యం. వారి ఐడియా చెప్పినప్పుడు అంతా వెకలిగా నవ్వారు. కానీ, జాన్సన్-మేయర్ మాత్రం ఆ నవ్వులను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఒక ఐడియా వచ్చింది. ‘క్రౌడ్ ఫండింగ్’ ద్వారా నిధులు సేకరించి, ఆ మొత్తంతో దీవిని కొనాలనేది వారి టార్గెట్. ఈ మేరకు వారు 2018లో ‘లెట్స్ బయ్ ఏన్ ఐలాండ్’ అనే స్టార్టప్ సంస్థను ఏర్పాటు చేశారు. వారి తరహాలోనే దీవులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారికి సహకరిస్తున్నారు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
క్రౌడ్ ఫండింగ్ ద్వారా వారిద్దరు 250,000 పౌండ్లు (రూ.2,250,21,972) సంపాదించారు. పెట్టుబడులను ఆహ్వానించడమే కాకుండా తమ సంస్థలో వాటాలు పెట్టేందుకు కూడా ఆహ్వానించారు. ఈ ఐడియా మరింత వర్కవుట్ అయ్యింది. మొత్తానికి వారు కరేబియాన్ దీవుల్లో ఒక దీవిని తమ సొంతం చేసుకున్నారు. బెలిజే తీరంలోని 1.2 ఎకరాల్లో ఈ ఐలాండ్ విస్తరించి ఉంది. ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ ఐలాండియా’గా పిలుస్తున్న ఈ మైక్రోనేషన్‌ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. కానీ, సొంత జాతీయ జెండా, గీతం, ప్రభుత్వం ఉన్నాయి. ఈ భూమిపై క్రౌడ్ ఫండ్‌తో కొనుగోలు చేసిన తొలి దీవి ఇదే. అంతేకాదు, ఇందులో పెట్టుబడులు మీరు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?