News
News
X

Warangal: పోలీసులను చూసి పారిపోయే యత్నం, ఛేజ్ చేసి పట్టుకున్నాక విషయం తెలిసి షాక్

మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతూ సహకరిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఛేజ్ చేసి చాకచక్యంగా పట్టుకున్నామని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

FOLLOW US: 
Share:

వరంగల్ : కాటారం మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతూ సహకరిస్తున్న పోలం రాజయ్య కొరియర్ ను అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్ పంపించినట్లు కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాటారం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టు కొరియర్ పోలం రాజయ్య అరెస్టును వివరాలను వెల్లడించారు. 

డిఎస్పి వివరాల ప్రకారం కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుప్పారం క్రాస్ రోడ్ వద్ద కాటారం ఎస్సై సుధాకర్ వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి బెదిరి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సిఆర్పిఎఫ్ పోలీసుల సహాయంతో ఛేజ్ చేసి చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. అతనిని విచారించగా మావోయిస్టు పార్టీ అగ్రీ నేత కంకణాల రాజిరెడ్డికి సహకరిస్తున్నట్లు విచారణలో వెళ్లడైందన్నారు. అతని వద్ద నుండి జిల్టెన్ స్టిక్స్ డిటర్నేటర్లు గ్రేనేడ్లు క్రాంతి పత్రిక విప్లవ సాహిత్యం స్వాధీనం వినిపించినట్లు డిఎస్పి వెల్లడించారు. 

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన పోలం రాజయ్య 1995 మావోయిస్టు పార్టీలో చేరి మావోయిస్టుల అగ్రనేతనకు అప్పుడు ప్రొటెక్షన్ ఫోర్సులో పనిచేశాడని ఆ తర్వాత 2002లో ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత కేకే డబ్ల్యూ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశం తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేసే పనిలో భాగంగా మాజీ మిలిటెంట్లను సానుభూతిపరులను రిక్రూట్మెంట్ చేసే పనిలో భాగంగా పొలం రాజయ్యను మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేస్తున్నాడని, ఇతను విద్యార్థులు ప్రజలను లో సిద్ధాంతాలను బోధిస్తూ మావోయిస్టు పార్టీలో చేర్పించడానికి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని డిఎస్పి వెల్లడించారు. 

అరెస్టు అయిన నిందితుడు పోలం రాజయ్య పై వివిధ ప్రాంతాల్లో 18 కేసులు ఉన్నట్లు డిఎస్పి తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై యువకులు, విద్యార్థులు పట్టవద్దని, తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డితో పాటు కాటారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ రావు కాటారం,కొయ్యూరు,ఎస్సైలు శ్రీనివాస్, సుధాకర్, కిషోర్ సిఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో ప్రీ రిజిస్ట్రేషన్ జరగాలి-వరంగల్ పోలీస్ కమిషనర్
వరంగల్ పోలీస్ స్టేషన్లో ప్రజలు చేసే న్యాయపరమైన ఫిర్యాదులపై తక్షణమే కేసు నమోదుచేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తోలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిధ్యాలయములోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇన్సెస్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ అధికారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు, చట్టపరంగాను, న్యాయపరమైన ఫిర్యాదులపై అధికారులు కేసుల నమోదు చేయడం ద్వారా పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. రానున్న రోజుల్లో గతంలో కన్నా 50 శాతం నుండి నూరు శాతం అధికంగా పోలీస్ స్టేషన్లలో ప్రీ రిజిస్ట్రేషన్ జరగాలని, ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలతోపాటు, భూ కబ్జాలు, తీవ్రంగా కొట్టిన కేసులు, రౌడీయిజంపై వచ్చే ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు తక్షణమే స్పందించి కేసులను నమోదు చేయాలన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ప్రజలకు న్యాయం చేయలేమని అధికారులు చట్టపరంగా విధులను నిర్వహిస్తునే, స్పష్టమైన, కఠినమైన, నిర్ణయాలను తీసుకోవాల్సి ఉందన్నారు. 

Published at : 24 Jan 2023 08:36 PM (IST) Tags: Crime News Maoists Warangal DSP Ram Mohan Reddy Maoist sympathiser

సంబంధిత కథనాలు

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే

Mini Medaram Jathara: మేడారం మినీ జాతర ప్రారంభం - నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు!

Mini Medaram Jathara: మేడారం మినీ జాతర ప్రారంభం - నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు!

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన