Medaram Jatara Dates: సమ్మక్క - సారలమ్మ జాతర తేదీలు ఖరారు, ఈ మూడు రోజుల్లోనే
వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతర తేదీలను నిర్ణయించారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన సమ్మక్క - సారలమ్మ మహా జాతర 2024 తేదీలు ఖరారయ్యాయి. ఈ మహా జాతర ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం మహా జాతర తేదీలను నిర్ణయించారు. తాజాగా గుడి సమీపంలో ఉన్న కమిటీ హాల్ లో కుల పెద్దలు, పూజారులు సమావేశమై సమ్మక్క - సారలమ్మ మహా జాతర 2024 జాతర తేదీలను నిర్ణయించారు. ఇప్పటికే మేడారం మినీ జాతర 2023 ఫిబ్రవరిలో ఘనంగా ముగిసింది.
21 ఫిబ్రవరి 2024న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం ఉండనుంది
22 ఫిబ్రవరి 2024న చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది
23 ఫిబ్రవరి 2024న భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు
24 ఫిబ్రవరి 2024న సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతల వన ప్రవేశం ఉంటుంది.
28 ఫిబ్రవరి 2024న తిరుగువారం జాతరతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహా జాతర పూజలు ముగుస్తుంది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వెలసిన ఆదివాసీ గిరిజన దైవాలుగా సమ్మక్క - సారలమ్మను భక్తులు కొలుస్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున జాతర ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తాజాగా మేడారం మహా జాతర 2024 తేదీలు ఖరారు అయ్యాయి.
తెలంగాణ కుంభమేళగా పేరు
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. భక్తిభావంతో అమ్మలను దర్శించుకుంటారు.
జాతర తొలిరోజు - కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది.
రెండో రోజు - చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు.
మూడో రోజు - వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలు అందుకుంటారు.
నాలుగో రోజు - తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.