News
News
X

Preethi Father: ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్య! ఆ ఇంజక్షన్ అతనే చేశాడు - తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

నిమ్స్ ఆస్పత్రి నుంచి ప్రీతి శరీరాన్ని తరలించేటప్పుడు కూడా ఆమె తండ్రి నరేంద్ర కొన్ని డిమాండ్స్ చేశారు. ఆమె ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర రిపోర్టు కావాలని నరేందర్‌ కోరారు.

FOLLOW US: 
Share:

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి మరణం పట్ల ఆమె తండ్రి తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని, ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని, ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని అన్నారు. సైఫ్ అనే వ్యక్తే ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు విచారణలో కనుగొనాలని పిలుపునిచ్చారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ అనస్థీషియా డిపార్డ్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేయాలని, ఆ తర్వాత ఈ వ్యవహారంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 26) నిమ్స్ ఆస్పత్రి నుంచి ప్రీతి శరీరాన్ని తరలించేటప్పుడు కూడా ఆమె తండ్రి నరేంద్ర కొన్ని డిమాండ్స్ చేశారు. మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేసిన తర్వాతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర రిపోర్టు కావాలని నరేందర్‌ కోరారు. మరణానికి కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకుంటామని, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్పారు. 

మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు ఏఆర్‌సీ వార్డు ముందు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐసీయూ గ్లాస్‌ డోర్‌ను కూడా బద్దలుకొట్టారు. కొందరు మహిళలు అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు.

దీంతో పోలీసులు వారిని వాహనాల్లోకి ఎక్కించి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని ఎందుకు బయటికి తీసుకొస్తున్నారంటూ ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపుతామని ఓ వైద్యుడు అనడంతో బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్ధరాత్రికల్లా పోస్టుమార్టం పూర్తి చేసి ఉదయానికి స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 

నేడు అంత్యక్రియలు

చివరికి అమె శరీరంతో ముందుగా బోడుప్పల్ నివాసానికి చేర్చారు. కానీ, అక్కడ ఉండకుండానే పోలీసులు ప్లాన్ మార్చారు. జనగామ జిల్లా మొంద్రాయికి ప్రయాణం అయ్యారు. గాంధీ ఆస్పత్రి నుంచి ప్రీతి పుట్టిపెరిగిన ఉప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె తండ్రి పోలీసులను వేడుకున్నారు. తమకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నందు వల్ల వరంగల్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే ప్రీతి డెడ్‌బాడీతో వరంగల్‌కు పోలీసులు బయలుదేరారు. మొండ్రాయి గిర్ని తండాలో ఆమె అంతక్రియలు నేడు (ఫిబ్రవరి 27) జరగనున్నాయి.

Published at : 27 Feb 2023 11:18 AM (IST) Tags: Kakatiya Medical college Preethi father Warangal medical college Medico Preethi Preethi saif news

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!

TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా

“ఆరోగ్య మహిళ

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌