News
News
X

వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ - వలస పోతున్న ఉద్యమకారులు

ఇప్పటికే బీఆర్ ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిన సీనియర్ నాయకులు కన్నెబొయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే మోలుగురి భిక్షపతి పార్టీ మారుతున్నట్లు ప్రకటన

FOLLOW US: 
 
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.  స్థానిక ఎమ్మెల్యే, నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఓరుగల్లు జిల్లా నుంచే ఎందుకు నాయకులు పార్టీ మారుతున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలు స్థానిక నాయకులపై అసంతృప్తి, మరికొందరి పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఉద్యమ నాయకులకు గుర్తింపు లేదు

రెండు నెలల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత  బీఆర్ఎస్ పార్టీకి  కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా చేశారు. బాధతోనే బీఆర్ఎస్ పార్టీతో 22ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జైలు జీవితం సహా అనేక విషయాలలో కేసీఆర్ కు తోడుగా ఉన్నట్లు చెప్పారు ఆయన. పదవులు కాదు.. ఆత్మగౌరవం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో ఉద్యమకారులు లేరని.. ఉద్యమకారులను కేసీఆర్ ఆదరించే పరిస్థితి లేదన్నారు.  బీఆర్ఎస్ లో ఉన్నంత కాలం బాధ తప్ప ఇంకేం ఉండదని రాజయ్య అన్నారు. వాపును బలుపు అనుకోవడం మంచి పద్ధతికాదని..అలాంటి అనేక పార్టీలు కంటికి కనిపించకుండా పోయాయన్నారు. కెసిఆర్‌పై అనేక విమర్శలు చేసి గులాబీ గూటి నుంచి బయటకి వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. 

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు సైతం బీఆర్ఎస్ పార్టీపై స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల కిందట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. గత నెలలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు పార్టీ మారడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ అంతర్గత కలహాలు బయటపడ్డాయి..

News Reels

అదే బాటలో మోలుగురి భిక్షపతి

హన్మకొండ జిల్లా పరకాల మాజీ శాసన సభ్యులు మోలుగురి భిక్షపతి ఈనెల 9వ తేదీన బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విధివిధానాలు నచ్చక బీఆర్ ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నట్లు మీడియా సమావేశంలో మొలుగూరి బిక్షపతి ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ నెల 9వ తేదీన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.

ఉమ్మడి జిల్లా నుంచి మరికొంత మంది అలక

గతంలో ఉద్యమంలో చురుకుగా ఉన్న నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడంతో పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గల నుంచి భారీగా వలసలు ఉంటాయని సమాచారం. ఏదీ ఏమైనా అధినేత ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని చక్కబెడతారా లేక వదిలేస్తారా అనే చర్చ సాగుతోంది.

Published at : 06 Oct 2022 04:42 PM (IST) Tags: TRS BRS Warangal Errabelli pradeep rao Bikshapathi Rajayya

సంబంధిత కథనాలు

Warangal News :  విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Warangal News : విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ విడుదల 

నేడు తెలంగాణలో ఏం జరగబోతున్నాయంటే?

నేడు తెలంగాణలో ఏం జరగబోతున్నాయంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

TS Police Physical Events: ఫిజికల్‌ ఈవెంట్స్‌‌కు అంతా రెడీ, అభ్యర్థులు వాళ్లను నమ్ముకుంటే అంతే సంగతులు !

TS Police Physical Events: ఫిజికల్‌ ఈవెంట్స్‌‌కు అంతా రెడీ, అభ్యర్థులు వాళ్లను నమ్ముకుంటే అంతే సంగతులు !

టాప్ స్టోరీస్

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్