By: ABP Desam | Updated at : 10 Dec 2022 08:52 PM (IST)
Edited By: jyothi
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy On BRS:భారత్ రాష్ట్ర సమితితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ర్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రగతి.... దేశానికి రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు. నిజామబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు సింగరి హేమంత్ వారి అనుచరులు, ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ... సీఎం కేసిఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం రెంజర్ల గ్రామస్థులు పార్టీలో చేరారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఆనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతి దేశానికి నేడు రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలాగే అభివృద్ది జరగాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ తోనే దేశ పురోగతి సాధ్యమని మంత్రి వేముల స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి అన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడిన MP అరవింద్ కు కవిత సరైన సమాదానం చెప్పిందని...సమర్దించారు. MLC కవితపై ఎంపీ అరవింద్ చేసిన కామెంట్లకు స్పందించారు. అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యభారతీయ జనతా పార్టీ నేతలకి ప్రతిపక నేతలకి కౌంటర్లు ఇవ్వడంలోనూ ముందుంటున్న మంత్రి వేముల....కేంద్ర ప్రభుత్వానికి భారత్ రాష్ట్ర సమితి అభివృద్ధితో జవాబు చెబుతోందని తెలిపారు. రాష్ర్టంలో ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశమంతటా ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తున్న BJP ...తెలంగాణలోనూ అదే పంథా కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఫెయిలయ్యిందని ...సీఎం KCR ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.
తెరాస పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాజముద్ర వేసింది. భారత్ రాష్ట్ర సమితి అవిర్భావ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, MLA లు , MP లు రాష్ల్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్య్రక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ పార్లమెంటరీ శాసనసభాపక్ష కార్యవర్గ విస్తృత స్ఠాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మారుస్తు ఏకేగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి KCR తోనే దేశ అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. సంక్షేమ పథకాలే తమకు అండగా నిలుస్తాయని ప్రజల అభ్యున్నతే భారత్ రాష్ట్ర సమితి ముఖ్య లక్ష్యమని తెలిపారు. సీఎం కేసిఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన వారు భారత్ రాష్ట్ర పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. భారత్ రాష్ట్ర సమితితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Father Colombo Medical College: ఫాదర్ కొలంబో కల ఇప్పటికి నెరవేరింది, మూడు మెడికల్ కాలేజీల నగరంగా వరంగల్: మంత్రి హరీష్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !