Top 5 Headlines Today: తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఫైనల్! ఢిల్లీలో జూపల్లి కాంగ్రెస్ కండువా!
Top 5 Telugu Headlines Today 2 August 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 2 August 2023:
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కార్మికులకు మేలేనా ? ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు లబోదిబోమంటున్నారు ?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేశారు. దీంతో అక్కడ ఉద్యోగులకు మేలు జరిగిందా లేదా అన్న చర్చ ప్రారంభమయింది. మరి ఏపీలో ఉద్యోగులకు మేలు జరిగిందా ? విలీనం వల్ల తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరుగుతుందా ?. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విలీనం తరువాత ఎలా ఉంది..కార్మికులు ఫుల్ ఖుషీనా.. శాలరీలు ఎలా ఉన్నాయి.. ఈ విషయాలను గురించి కార్మికులను ప్రశ్నిస్తే దిమ్మ తిరిగే విషయాలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్దలో విలీనంత తరువాత పరిస్దితులు పై కార్మికుల నుండి షాకింగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. సీనియర్లను కాదని, జూనియర్లకు శాలరీల పెంపుదల చేయటం పై వారు మండిపడుతున్నారు. అదేం లెక్కంటే అధికారులు నోరు మెదపటం లేదని గుర్రుగా ఉన్నారు. విలీనం అయిన సంతోషం లేదంటున కార్మికుల వర్గాలు. పూర్తి వివరాలు
గురువారం నుంచే తెలంగాణ అసెంబ్లీ - కేసీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారా ?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతోంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. పూర్తి వివరాలు
అప్పుడే అయిపోలేదు 'బ్రో', ఇప్పుడే మొదలైంది అంటున్న అంబటి
బ్రో సినిమాలో తనపై సెటైర్లు వేయటాన్ని సీరియస్‌గా తీసుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. తనకు ఎలాంటి కోపం లేదంటూనే పవన్‌పైన, ఈ సినిమా యూనిట్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ పై బయోపిక్ తీస్తానంటూ నిన్న ప్రకటించిన అంబటి తన పోరాటాన్ని ఢిల్లీస్థాయికి తీసుకెళ్లాలని భవిస్తున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల కోసం వెళ్లి అక్కడే ఉన్న ఎంపీలతో కలిసి దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు
తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఫైనల్ - మరి పొత్తుల సంగతేంటి ?
తెనాలి నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్దిగా నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో తెనాలి నుండి జనసేన పార్టినే పోటీ చేస్తుందని ఫిక్స్ చేశారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. పొత్తుల్లో భాగంగా క్లారిటీ వస్తే ఈ మాట చెప్పారా లేకపోతే.. టీడీపీకి కౌంటర్ గా ఈ ప్రకటన చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెనాలి నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ పేరు ఫిక్స్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పూర్తి వివరాలు
ఢిల్లీకి జూపల్లి అండ్ టీం - అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న నేతలు!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు ఢిల్లీ వేదికగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి చేరాలని భావించినప్పటికీ అది వీలు పడటం లేదని అందుకే ఢిల్లీ వేదికగా పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. జూపల్లితో పాటు పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అవుతారు. అక్కడే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథఅ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మెఘా రెడ్డి తదితరులు హస్తం పార్టీలో చేరబోతున్నారు. పూర్తి వివరాలు