అన్వేషించండి

Telangana Assembly : గురువారం నుంచే తెలంగాణ అసెంబ్లీ - కేసీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారా ?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు సందేశం ఇవ్వడానికి వినియోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.


Telangana Assembly :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతోంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగట్టే అవకాశం 

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్  రెడీ అవుతోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ తీరును కూడా కేసీఆర్ సభ ద్వారా ప్రజలకు  వివరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

ఢిల్లీకి జూపల్లి అండ్ టీం - అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న నేతలు!

కొత్తగూడెం నుంచి ఎవరు ఎమ్మెల్యే ? 

 కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది.  దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగుతోంది.   తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి.. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కానీ ఎలాంటి నిర్ణయంమ తీసుకోలదేు.  సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది.స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.  ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని భావిస్తున్నారు. 

హైదరాబాద్‌కు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ఈసారి ఎక్కడికో తెలుసా?

పటిష్ట  ఏర్పాట్లు చేసిన అధికారులు 
  
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.  అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వ‌హించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరముందని స్పీకర్ పోచారం ప్రకటించారు.  గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీక‌ర్ పోచారం కోరారు. స‌భ్యులు అడిగిన స‌మాచారాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అందించాల‌న్నారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంద‌న్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.               

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
CM Revanth Reddy: తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్
తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తా: కరీంనగర్‌లో సీఎం రేవంత్

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
34 Percent BC Reservation Supreme Court: బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు ప్రకటన
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Embed widget