అన్వేషించండి

Vande Bharat Train: హైదరాబాద్‌కు మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ఈసారి ఎక్కడికో తెలుసా?

సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు సర్వీసు ప్రారంభం కాబోతుంది. కాచిగూడ - యశ్వంత్ పూర్‌ (బెంగళూరు) స్టేషన్ల మధ్య ఈ రైలు సర్వీసు నడవనుంది.

తెలంగాణకు మరో వందేభారత్ రైలు రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, తాజాగా మూడోది కాచిగూడ నుంచి మొదలు కానుంది. ఈ మేరకు కొత్త వందేభారత్ రైలు చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి నిన్ననే (జూలై 31) కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరింది. 

సికింద్రాబాద్ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు సర్వీసు ప్రారంభం కాబోతుంది. కాచిగూడ - యశ్వంత్ పూర్‌ (బెంగళూరు) స్టేషన్ల మధ్య ఈ సెమీ బుల్లెట్‌ రైలు సర్వీసు నడవనుంది. దక్షిణ మధ్య రైల్వేకు ఇది మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. ఈ వందేభారత్ రైలు సేవలు ప్రారంభం అయ్యే తేదీ మాత్రం ఖరారు కాలేదు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆగస్టు 6న లేదా 15వ తేదీన జరగొచ్చని అంటున్నారు. లేదంటే ఆ తేదీల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు.

వందేభారత్‌ రైళ్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్యలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, తిరుపతికి మధ్య నడుస్తున్నాయి. ఇక మూడో రూట్‌లో కర్ణాటకకు పరుగులు పెట్టనుంది. 

టైమింగ్స్ ఇవీ..
ప్రస్తుతం రైలులో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే రైలు ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్‌ రైలు మాత్రం కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే బెంగుళూరు చేరుకోనుంది. కాచిగూడలో పొద్దున 6 గంటల సమయంలో బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర వరకు బెంగళూరుకు చేరుకుంటుంది. మళ్లీ అక్కడ 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు ప్రారంభ తేదీని, సమయాలను మాత్రం ఇంకా రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించలేదు.

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ వందే భారత్ రైళ్లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఆధునికత, సాంకేతికత, భద్రత వంటి ఫీచర్లతో వందే భారత్ రైళ్లు ఆకట్టుకునేలా రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం బ్లూ కలర్ వందే భారత్ రైళ్లను మనం చూస్తున్నాం. త్వరలోనే కాషాయ రంగులోనూ ఈ రైళ్లను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే ప్రయాణికుల మరింత మెరుగైన అనుభూతిని, ప్రయాణ అనుభవాన్ని అందించేలా మరిన్ని ఫీచర్లు తీసుకువస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

వందే భారత్ రైళ్లలో సీట్ల కుషన్ గట్టిగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ లలో మెత్తటి కుషన్ లను వాడనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మారుస్తారు. ఫుట్ రెస్ట్ ను మరింతగా పొడగించనున్నారు. దివ్యాంగుల వీల్ ఛైర్ కోసం ప్రత్యేక పాయింట్ ను ఏర్పాటు చేసి అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్ తో మాట్లాడేందుకు బోర్డర్ లెస్ ఎమర్జెన్సీ బ్యాక్ యూనిట్ లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్ లో మార్పులు చేస్తారు.

కోచ్ లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ను మరింతగా మెరుగుపరుస్తారు. ఎయిర్ టైట్ ప్యాన్సల్స్ లో మార్పులు చేయనున్నారు. ఎమర్జెన్సీ పుష్ బటన్ ను మరింత సులువు చేయనున్నారు. కోచ్ కు కోచ్ కు మధ్య అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్ ను మరింత పారదర్శకంగా రూపొందిస్తారు. టాయిలెట్లలో లైటింగ్ మెరుగుపరుస్తారు. 1.5 వాట్ల నుంచి 2.5 వాట్ లకు పెంచుతారు. నీటి ప్రవాహం మరింత మెరుగుపడేలా వాటర్ ట్యాప్ ఏరేటర్లు ఏర్పాటు చేస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Adilabad Tiger News Today: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
Thala Movie Teaser: హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కొడుకు - ‘తల’ టీజర్ చూశారా?
హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమ్మ రాజశేఖర్ కొడుకు - ‘తల’ టీజర్ చూశారా?
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Embed widget