News
News
వీడియోలు ఆటలు
X

Telangana weather report: పగలంతా ఎండలు, సాయం కాలం వానలు - రానున్న ఐదురోజులు తెలంగాణలో వెదర్ ఇలా!

Telangana weather report: తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి పూట ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తాయని వివరించింది.

FOLLOW US: 
Share:

Telangana weather report: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో నేడు, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవబోతున్నట్లు పేర్కొంది. అలాగే 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే పగటి పూటంతా ఎక్కువగా ఉష్ణోగ్రత సాయంత్రం సమయంలో వర్షాలు పడే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణలో వాతావరణ స్థితి

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే, 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం నేడు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ లో ఇలా

‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా

ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు  తెలిపారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా..

ఐదు నెలల్లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి మంగళవారం నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 75కి మెరుగుపడిన తర్వాత పరిస్థితి 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అంతకుముందు ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 11న ఏక్యూఐ 66 కంటే తక్కువగా నమోదైంది. వర్షం, బలమైన గాలులు ఢిల్లీ గాలిని క్లియర్ చేశాయి.

Published at : 23 Mar 2023 06:10 PM (IST) Tags: Telangana Weather Report Rains In Telangana Telangana News Rains in Hyderabad Waether Updats

సంబంధిత కథనాలు

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!

Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!