అన్వేషించండి

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం

Telangana News: తెలంగాణ అంటేనే త్యాగం అని.. రాచరిక వ్యవస్థకు తెలంగాణ ప్రజలు పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ 'ప్రజాపాలన' దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Telangana Liberation Day Celebrations 2024: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 'ప్రజాపాలన' దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గన్ పార్క్ (Gun Park) వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో (Public Garden) జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత 'ఓ నిజాము పిశాచమా... కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని..' అన్న దాశరథీ కవితతో తన ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని.. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని అన్నారు. '4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు. నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను మట్టి కరిపించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైంది. ఇది ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఆనాటి పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి.' అని సీఎం పేర్కొన్నారు.

'అందుకే ఆ పేరు పెట్టాం'

'తెలంగాణ ప్రస్థానంలో సెప్టెంబర్‌ 17 అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటివరకూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. లోతైన ఆలోచన తర్వాత 'ప్రజా పాలన దినోత్సవం'గా ఈ రోజును జరుపుకోవడం సముచితంగా ఉంటుందని భావించాం. సెప్టెంబర్‌ 17, 1948 తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి... ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావులేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. అందుకే ఆ పేరు పెట్టాం.' అని సీఎం రేవంత్ వివరించారు.

'ఫామ్ హౌస్ సీఎంను కాదు'

'ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గళమెత్తి వినిపించిన అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చింపిన విస్తరిలా తయారుచేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు యత్నిస్తున్నాం. నా ఢిల్లీ పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫాంహౌస్‌ ముఖ్యమంత్రిని కాదు... పని చేసే ముఖ్యమంత్రిని. ప్రపంచ వేదికపై ‘‘ఫ్యూచర్‌ స్టేట్‌’’గా బ్రాండ్‌ చేస్తున్నాం. యువత భవితకు పెనుసవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. టీ - న్యాబ్‌ బలోపేతం చేశాం. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి... ఉపాధి, ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. గత పదేళ్ల పాలకుల పాపంతో ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోయింది. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రా ఏర్పాటు చేశాం. ఇది ఓ ప్రకృతి యజ్ఞం. ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. సెప్టెంబర్‌ 17 ఇకపై ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
Konda Surekha Apology To KTR: కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు - సారీ వెనుక ఘర్ వాపసీ స్కెచ్ ఉందా?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు - సారీ వెనుక ఘర్ వాపసీ స్కెచ్ ఉందా?
Miyapur Lands Case Supreme Court: మియాపూర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ విక్టరీ - 550 ఎకరాలు సర్కార్‌వే!
మియాపూర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ విక్టరీ - 550 ఎకరాలు సర్కార్‌వే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget