అన్వేషించండి

TS Covid News: కరోనా థర్డ్ వేవ్ అలర్ట్.. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్.. తెలంగాణ ఆరోగ్య శాఖ అప్రమత్తం..

దేశంలో కరోనా థర్ఢ్ వేవ్ రానుందన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి పడకకూ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందించాలని నిర్ణయించింది.

దేశంలో కరోనా థర్ఢ్ వేవ్ రానుందని హెచ్చరికలు వస్తోన్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. థర్ఢ్ వేవ్ ఉద్ధృతి ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి పడకకూ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17 వేల బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా.. తాజాగా మరో 10 వేల పడకలకు ఆక్సిజన్ ఫెసిలిటీ అందించనుంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే కొనసాగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇక ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ కనీసం 20 బెడ్లతో కూడిన ఐసీయూను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థర్ఢ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో.. 20 శాతం బెడ్లను చిన్నారుల కోసం కేటాయించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. 

Also Read: TRS Meeting: నేడు టీఆర్ఎస్ కీలక భేటీ... దళిత బంధు, హుజురాబాద్ ఉపఎన్నికపై శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్..
సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు.. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ సొంత ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించడానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం సహా కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా పూర్తి చేసింది. రాష్ట్రంలో 2 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఆస్పత్రి వర్గాలకు సూచించింది. 

బెడ్ల సంఖ్యను బట్టి ప్లాంట్..
ఆస్పత్రికి కేటాయించిన బెడ్ల సంఖ్యను బట్టి ఆక్సిజన్‌ ప్లాంటును నెలకొల్పాలనే యోచనలో ఆరోగ్య శాఖ ఉంది. 100 నుంచి 200 బెడ్లు ఉన్న ఆసుపత్రుల్లో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 200 నుంచి 500 మధ్య బెడ్లు ఉన్న ఆసుపత్రుల్లో నిమిషానికి వెయ్యి లీటర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును నిర్మించనుంది. ఇక 500 పడకలు దాటితే నిమిషానికి 2000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యమున్న ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 

సెప్టెంబరులో రోజుకు 5 లక్షల కేసులు..
కరోనా థర్డ్ వేవ్ రావడం తథ్యమని.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని వణికించే ప్రమాదం ఉందని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం), నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. సెప్టెంబరులోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. థర్డ్ వేవ్ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాయి. 

Also Read: Weather Updates: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Also Read: Afghanistan News: తాలిబన్ల చెర నుంచి ఒక్కరోజులో 10 వేల మందిని కాపాడిన అమెరికా సైన్యం.. వైట్ హౌస్ ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget