అన్వేషించండి

Weather Updates: వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులు, బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఏపీలో వర్షాలు

ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని భారత వాతవరణ శాఖ తెలిపింది. దీంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇవాళ ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. 

Also Read: Horoscope Today: ఈ రాశులవారికి కొత్తగా చేపట్టే పనులతో ప్రయోజనం.. వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా సోమవారం భారీ వర్షాలు కురిశాయి. 

Also Read: Telangana School Reopen: తెలంగాణ విద్యార్థుల్లారా పుస్తకాల బ్యాగ్ దుమ్ము దులపండి.. సెప్టెంబర్‌ 1 నుంచి బడికి పోదాం..

అప్రమత్తంగా ఉండండి

మరో అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. 
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.  అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. అత్యవసర సేవలు అందించడానికి డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు విభాగాల అత్యవసర బృందాలు సిద్ధంగా ఉన్నాయి.  

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సి ఫోన్ నంబర్లు 

  • ఎన్డీఆర్ఎఫ్ ఎమర్జెన్సీ : 8333068536, 9121240141, 9000113667
  • జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ : 97046018166, 9000113667, 6309062583 
  • పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్: 100
  • విద్యుత్ శాఖ ఎమర్జెన్సీ నెంబర్ : 9440813750 

 

Also Read: Amaravati News : వాయిదా కోరుకున్న పిటిషనర్లు ..అభ్యంతరం చెప్పని ప్రభుత్వం..! నవంబర్ 15కు అమరావతి వ్యాజ్యాల విచారణ వాయిదా !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
New Years Invitation: న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
న్యూ ఇయర్ ఇన్విటేషన్ లో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన పబ్
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?
ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?
Kodani Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Embed widget