అన్వేషించండి

Telangana School Reopen: తెలంగాణ విద్యార్థుల్లారా పుస్తకాల బ్యాగ్ దుమ్ము దులపండి.. సెప్టెంబర్‌ 1 నుంచి బడికి పోదాం..

అంగన్‌వాడీలతోపాటు తెలంగాణలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 30 నాటికి విద్యాసంస్థలను ఆ మేరకు రెడీ చేయాలని అధికారులు ఆదేశించారు.

తెలంగాణలో బడిగంట మోగి టైం దగ్గరపడింది. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాస్‌లతో నెట్టుకొచ్చిన చదువులు ఇప్పుడు తరగతి మెట్లెక్కనున్నాయి. స్కూల్స్‌ రీఓపెన్ చేయాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30లోగా  సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. 

కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థల రీఓపెన్‌పై ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమీక్ష జరిగింది .  ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. కరోనా కారణంగా విద్యాసంస్థలు చాలా ఇబ్బంది పడ్డాయని.. అటు తల్లిదండ్రులు, ఇటు ప్రైవేటు టీచర్లు, యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడ్డాయన్నారు. అన్ని వర్గాల్లో అయోమయ పరిస్థితి నెలకొందని... దీన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందుకే ముందుడుగు వేసి స్కూల్స్‌ తెరవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు కేసీఆర్. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థల పున: ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలను ఈ భేటీలో చర్చించారు. 

రాష్ట్రంలో ఇప్పుడు  నమోదవుతున్న కేసుల వివరాలు, పాజిటివిటీ రేట్‌, ఆరోగ్య పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. వైద్యశాఖ అధికారులతో చర్చించారు. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు సీఎంకు వివరించారు. ప్రస్తుతం జన సంచారం కూడా సాధారణ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. 
 విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడం మంచిది కాదని.. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని.. విద్యాసంబంధిత అంశాల్లోనూ వెనుకబడుతున్నారని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు.  ఇలా మరికొన్ని రోజులు జరిగితే వారి భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే పరిస్థితి ఉందని చెప్పే అధ్యయనాలు కేసీఆర్‌ ముందు ఉంచారు. 

అన్నింటిపై కూలంకుశంగా చర్చించిన కేసీఆర్‌, అధికారులు విద్యాసంస్థల పునఃప్రారంభానికి మొగ్గు చూపారు. కెజి నుంచి పీజీ దాకా, ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పున: ప్రారంభించాలని  నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 

ఇన్నాళ్లూ పాఠశాలలు మూతబడి ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుద్ధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖకు అప్పగించారు సీఎం. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్‌లదేనని సిఎం పునరుద్ఘాటించారు. 

వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను  కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి శానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ ఛైర్మన్లను సిఎం ఆదేశించారు.

పాఠశాలల శుభ్రత కోసం జిల్లా పరిషత్ ఛైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు శానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉన్నయో లేవో పరిశీలించాలన్నారు సీఎం. ఈ విషయాన్ని జిల్లాల డిపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు,  ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు కేసీఆర్. ఈ నెల 30 తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

విద్యాసంస్థలు తెరిచిన తర్వాత విద్యార్థులకు జలుబు, జ్వరం ఉంటే సమీప ఆసుపత్రికి తరలించాలన్నారు కేసీఆర్. ఈ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఒక వేళ కోవిడ్ నిర్దారణైతే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సిఎం సూచించారు. 
పాఠశాలకు వచ్చే విద్యార్థులు విధిగా శానిటైజ్‌ చేసుకోవడం, మాస్కులు పెట్టకోవడం  తప్పని సరి అన్నారు.  అంతా కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలని కేసీఆర్ సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని విద్యార్థులకు గట్టిగా చెప్పాలన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget