Horoscope Today: ఈ రాశులవారికి కొత్తగా చేపట్టే పనులతో ప్రయోజనం.. వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 24 మంగళవారం రాశిఫలాలు
మేషం
మేషరాశివారికి ఈరోజు కలిసొస్తుంది. ఆర్థికంగా కలిసొచ్చే రోజు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తవుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వివాదాలుండే అవకాశం ఉంది. ప్రయాణాలు సంతోషంగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాలవైపు మొగ్గు చూపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభం
మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావచ్చు. టెన్షన్ తగ్గుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. వృత్తికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
మిథునం
ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలరు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పరీక్ష, ఇంటర్యూలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ మద్దతు లభిస్తుంది. మీరు ఓ సమస్య నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి
బంధువులను కలుస్తారు. ఆఫీసులో మరింత బాధ్యత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఎక్కువ ఒత్తిడికి లోనుకాకండి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. పని చేసే వ్యక్తులకు శుభవార్తలు అందుతాయి.
Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…
సింహం
మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం తెరపైకి రావచ్చు. అకస్మాత్తుగా కొత్త ఖర్చులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. స్నేహితుడి కోపానికి గురికావొద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. విద్యార్థులకు మంచి రోజు.
కన్య
ఈరోజు కొంత గందరగోళంగా ఉంటారు. బంధువుల నుంచి దుర్వార్తలు వినేఅవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేముందు ఓసారి ఆలోచించండి. టెన్షన్ పెరుగుతుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. ప్రమాదం కారణంగా నష్టపోతారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి.
తులారాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది. పని ప్రదేశంలో ప్రయోజనం పొందుతారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయి. మీ బాధ్యతలను పూర్తి చేయగలరు. బంధువులను చాలా కాలం తర్వాత కలుస్తారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. బయట తినొద్దు.
వృశ్చికరాశి
ఈ రోజు మీకు బావుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మాటపై సంయమనం పాటించండి. అప్పులిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. డ్రగ్స్, లాటరీ, జూదంకి దూరంగా ఉండండి. మీ కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి.
ధనుస్సు
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. కుటుంబ సమస్యల కారణంగా కొంత చికాకుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ పనిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
మకరం
ఈ రోజు మీకు మంచిరోజు. కొత్త వ్యక్తులను కలుస్తారు. రోజంతా ఆహ్లాదంగా ఉంటారు. దినచర్యలో మార్పు ఉంటుంది. మీ ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్నేహితులను కలుస్తారు. బాధ్యతల నుంచి తప్పుకుపోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనిని వాయిదా వేయవద్దు.
కుంభం
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. టెన్షన్ పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. స్నేహితుల సహాయంతో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. యాత్రకు వెళ్ళొచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులు విజయం సాధిస్తారు.
మీనం
మీరు శుభవార్త వింటారు. మతపరమైన కార్యక్రమం ఇంట్లో జరగొచ్చు. కొన్ని పనుల విషయంలో రిస్క్ తీసుకోండి. ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. స్నేహితులతో సంతోష సమయాన్ని గడుపుతారు. ఒత్తిడి దూరమవుతుంది.
Also Read:సమస్యల వలయంలో ఉన్నారా… బయపడే మార్గాలను ఇలా అన్వేషించండి
Also Read: శత్రువు ఎంత బలహీనంగా ఉంటే... విజయం అంత కష్టమవుతుంది...చాణక్యుడు చెప్పే కేటగిరిలో మీరు ఎక్కడ ఉన్నారు