Chanakya Moral Story: సమస్యల వలయంలో ఉన్నారా… బయపడే మార్గాలను ఇలా అన్వేషించండి

సమస్యను చూసి పారిపోతున్నారా…. అక్కడితో జీవితం ముగిసినట్టే అని భావిస్తున్నారా….అసలు పరిష్కారం లేని సమస్య ఉంటుందా…సమస్యలు చుట్టుముట్టినప్పుడు బయటపడేదెలా? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు…

FOLLOW US: 

ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ఒకటి. ప్రస్తుత విశ్వవిద్యాలయాలు నేర్పే విద్యతో పోల్చితే తక్షశిల విశ్వవిద్యాలయంలో నేర్పే విద్య ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆహా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు సాధ్యమా అనిపించకమానదు. ఇందులో చదివిన వారంతా గొప్పవారయ్యారు. ఆచార్య చాణక్యుడు కూడా తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా సేవలందించాడు. ఆ సమమంలో విద్యార్థులకు చెప్పిన ఓ నీతి కథ నేటి తరం కూడా తెలుసుకోవాలి. అదేంటంటే…

అడవిలో లేడి భారంగా అడుగులు వేస్తూ వెళుతోంది. నిండు గర్భిణి కావడంతో అప్పుడే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవించేందుకు అనుకూల ప్రదేశం కోసం వెతుకుతోంది. ఓ మూల దట్టమైన గడ్డి కనపడింది…అటుగా నది కూడా ప్రవహిస్తోంది. అదే మంచి ప్రదేశం అనే ఆలోచనతో అటుగా అడుగులు వేస్తోంది. ఇంతలో దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు మొదలయ్యాయి. ఏ గడ్డిచూసి అటువైపు వెళుతోంది…పిడుగుపడి ఆ గడ్డికి నిప్పంటుకుంది. మరోవైపు నుంచి సింహం వస్తోంది…ఇంకోవైపు వేటగాడు బాణం ఎక్కుపెట్టి ఉంచాడు…నాలుగో వైపు నది ఉంది. ఇప్పుడా లేడి ఏం చేస్తుంది? ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకుంటుంది? బిడ్డకు జన్మ ఇస్తుందా ? ఇచ్చినా ఇద్దరూ బతుకుతారా? సింహం లేడిని తినేస్తుందా? వేటగాడు లేడిని చంపేస్తాడా ? గడ్డికి అంటుకున్న నిప్పులో లేడి దహనమవుతుందా? అసలేం జరగబోతోంది?

ఓ నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడి ఇవేం పట్టించుకోలేదు. అప్పడు దాని దృష్టంతా కాసేపట్లో కళ్లముందుకి రాబోయే బిడ్డపైనే ఉంది. ప్రాణం పోతేపోనీ… బిడ్డను కనడంమీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఎలా మారాయో తెలుసా….వర్షంతో పాటు పిడుగు పడింది.. ఆ పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరి బాణం గురి తప్పింది.. అది వెళ్లి సింహానికి తగిలింది. వర్షం పడి అడవిలో రాజుకున్న మంటలు ఆరిపోయాయి. అదే సమయంలో లేడి పిల్ల తల్లి గర్భం లో నుండి బయటకు వచ్చింది.

అదే లేడి తన ప్రాణం గురించి అలోచించి..చుట్టూ పరిస్థితులు చూసి బిడ్డకు జన్మ నివ్వడంపై దృష్టి పెట్టకుండా ఉండి ఉంటే…తప్పకుండా తప్పటడుగు వేసేది. అప్పుడేం జరిగేది? . మన జీవితాలు కూడా అంతే. జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. ఆ సమస్యలు చూసి కుంగిపోతే నెగటివ్ ఆలోచనలు మరింత పెరుగుతాయి. అప్పుడు ఆలోచనలు దారితప్పుతాయి. తప్పుడు ఫలితం పొందాల్సి వస్తుంది. అలాకాకుండా…మనపని మనం చేసుకుపోతుంటే… వచ్చే అడ్డంకులు ఎలా వచ్చాయో అలాగే పోతాయంటాడు చాణక్యుడు.

Published at : 03 Aug 2021 01:03 PM (IST) Tags: Chanakya Motivational Story What to do if life is surrounded by problems a wonderful moral story

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Gyanvapi Mosque Row: మూడు దశాబ్దాల క్రితమే మొదలైన జ్ఞానవాపి మసీదు వివాదం

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్క‌డ దాక్కున్నా లాక్కొచ్చి లోప‌లేయిస్తా: చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!

RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!