School Timings Change: తెలంగాణలో పాఠశాలల టైమింగ్స్ మార్పు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
TG School Timings Change | తెలంగాణలో ప్రైమరీ స్కూల్ టైమింగ్స్ కు అనుగుణంగా ఉన్నత పాఠశాలల స్కూల్ వేళలు మార్చుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
School Timings Changed in Telangana | హైదరాబాద్: తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మారాయి. రాష్ట్రంలో పాఠశాలల వేళలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మారిన స్కూల్ టైమింగ్స్ పై విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల (Primary School Timings) సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల స్కూల్ సమయాల్లో మార్పు చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
విద్యాశాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఉన్నత పాఠశాలు (High School Timings) వేళలను ఉదయం 9:30 నుంచి 9:00 గంటలకు మార్చారు. అదే విధంగా ప్రతిరోజూ సాయంత్రం 4:45 గంటలకు బదులుగా 4:15 గంటలకు స్కూల్ పని పనివేళలు పూర్తవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రస్తుతం అమలు అవుతున్న పని వేళలు కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఉదయం 8:45కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి.
మరోవైపు వర్షాకాలంలో పాఠశాలలకు పరిస్థితిని బట్టి సెలవులు ప్రకటించడం లాంటివి చేయడం తెలసిందే. తుఫాన్ సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. కొన్ని సందర్భాలలో పరీక్ష తేదీలను సైతం ప్రతికూల వాతావరణం కారణంగా మార్పు చేస్తుంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వులు అనుసరించి పాఠశాలలు పని చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు.