అన్వేషించండి

K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు - కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

Telangana News: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Keshava Rao As Telangana Government Advisor: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కె.కేశవరావుకు (K.Keshava Rao) తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (Telangana Government Advisor) నియమించింది. కేకేకు ఉన్న అపార రాజకీయ, పాలనాపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

కాగా, ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన కేశవరావు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత రోజే రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉండగానే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న అనంతరం ఆ పదవిని వదిలేశారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికల ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కుమారుడు విప్లవ్ ఇంకా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు.

కేకే మొదటి నుంచీ కాంగ్రెస్ నేత కాగా.. పలుమార్లు పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ ఒక్కసారే విజయం సాధించారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. వివిధ పదవుల్లో మాత్రం కొనసాగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగా.. హస్తం పార్టీలోకి క్రమంగా వలసలు పెరిగాయి. ఈ క్రమంలోనే కేకే సైతం తన సొంతగూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు హస్తం పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు. 

'కాంగ్రెస్ నా సొంతిల్లు'

కాంగ్రెస్ తన సొంతిల్లని.. తాను ఎప్పుడూ కాంగ్రెస్ మనిషేనని కే.కేశవరావు పార్టీ చేరిక సందర్భంగా చెప్పారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ ఫీలింగ్ ఉందని.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. తిరిగి హస్తం పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందని ప్రశంసించారు. తాను నైతిక విలువలతోనే రాజీనామా చేశానని.. రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా అదే చెప్పానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

మరోవైపు, కాంగ్రెస్‌లోకి వలసలు ఆగడం లేదు. ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యేను హస్తంలోకి సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంలో చేరిపోయారు. శుక్రవారం ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైంది: బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్ మొదలైంది: బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
Vikarabad Road Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీకొని నలుగురు మృతి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget