అన్వేషించండి

Telangana Assembly: 'కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు' - జల దోపిడీ అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటన

Telangana Assembly Session 2024: కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది.

Telangana Assembly Session on KRMB Issue: కృష్ణా నదీ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. కృష్ణా నదీ జలాల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 'గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైంది. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారం. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే ఎక్కువ అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయ్యాయి. ఇన్ ఫ్లో తగ్గి డైవర్షన్ పెరిగింది. కృష్ణా జలాలను అదనంగా ఏపీ ప్రభుత్వం తరలిస్తున్నా మౌనంగా ఉన్నారు. పాలమూరు - రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీలే క్లెయిమ్ చేశారు. ఇప్పుడు 50 శాతం కావాలని అడుగుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ వైఎస్ హయాంలో 44 వేల క్యూసెక్కులను 2020లో ఏపీ సీఎం జగన్ 90 వేలకు పెంచారు. అయినా అప్పటి కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు.' అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. 

అంతకుముందు 'కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. గతంలో కేసీఆర్ పాలనలో తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణ శాపాలయ్యాయని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. 'ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపింది. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయింది. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారు.' అని విమర్శించారు.

'కేసీఆర్ ను జగన్ పొగిడారు'

నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ పాలకులది అసమర్థతో.. అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఢిల్లీ వెళ్లి 512.299 టీఎసీలకు ఒప్పుకొన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోంది. కృష్ణా జలాల్లో 70 శాతం హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారు. కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం 203 జీవో ఇచ్చి రోజుకు 3 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ పూర్తైతే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తోంది. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి పరోక్షంగా సహకరించారు. కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు కాలేదు. అప్పుడు సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2013లోనే ప్రాజెక్ట్ పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి చేయలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి' అని ఉత్తమ్ అన్నారు.

Also Read: KTR Tweet: బీఆర్ఎస్ ఒత్తిడితోనే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ తీర్మానం - ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయమంటూ కేటీఆర్ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget