Telangana Elections 2023 : రాజ్యాధికారం కోసం బీసీలు ప్రయత్నం చేయాలి - తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ పిలుపు !
Pawan Kalyan : బీసీలు రాజ్యాధికారం కోసం పని చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం , సూర్యాపేట ప్రచారసభల్లో పవన్ ప్రసంగించారు.
Telangana Elections 2023 Pawan Kalyan : తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కొత్తగూడెం, సూర్యాపటల్లో జరిగిన బహిరంగసభల్లో బహిరంగసభల్లో పవన్ మాట్లాడారు. నిధులు, నియామకాలు, నీళ్లపై తెలంగాణ ఉద్యమం జరిగింది.. ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బంది పడ్డ నల్గొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి..తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలి.. మోడీ నాయకత్వంలో దేశంలో అందరికి సమానత్వం నినాదంతో పాలన సాగుతుంది.. జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుందని ప్రకటించారు.
జై తెలంగాణ అని ప్రసంగం మొదలు
తెలంగాణ ప్రచార సభల్లో పవన్ జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభిస్తున్నారు. జన్మ నిచ్చిన తెలంగాణ జై తెలంగాణ అన్నారు పవన్. తెలంగాణలో మాట్లాడే అవసరం వచ్చిందన్నారు. పోరాట స్ఫూర్తి నీ ఇచ్చిన తెలంగాణ… అణగారిన తెలంగాణ కోసం తను అండగా వుంటానని.. వెనకడుగు ఎప్పుడు వేయనని అన్నారు. తెలంగాణలో వున్న పోరాట స్ఫూర్తి.. దేశమంతా వుంటే అవినీతి ఎప్పుడో వెళ్ళిపోయేదని అన్నారు. మీకు వెన్నంటి నిలబడే పార్టీలు తెలంగాణలో కావాలన్నారు. బీజేపీ పరిపాలన జరుగుతున్న రాష్ట్రాల్లో బీసీలకు ప్రాధాన్యత ఉందన్నారు. గద్దరన్నకు చెప్పిన మాటకు నిలబడుతానని.. గద్దర్ ఆత్మ శాంతిగా వుండాలంటే ఆయన ఆశయాలను సాధించాలని గుర్తుచేసుకున్నారు. నిధులు నీళ్లు నియామకాలు కోసం పోరాటం చేశారని అన్నారు. తన మద్దతు నిర్ణయం నరేంద్ర మోడీ కి వుంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం అయినా బీసీలకు రాజ్యాధికారం
కేసీఆర్ మీద గౌరవం, కేటీఆర్ మీద నమ్మకం వుందన్నారు. అయితే బీజేపీ వల్లనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే ఎన్నికలు రావాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటుందని ప్రజలకు సూచించారు. తను లేకపోయినా తెలంగాణలో జనసేన వుంది అంటే ఇక్కడి కార్యకర్తల కృషి నాది మానవత్వం అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండు ఓకే.. దానిలో వుండే విధంగా చేసిన దాశరథి నాకు స్ఫూర్తి అన్నారు. సనాతన ధర్మం సోషలిజం రెండింటినీ నేను నడిపిస్తా అన్నారు. మనస్పూర్తిగా బీజేపీకి మద్దతు జనసైనికులు ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నీ ఎందుకు తిట్టలేదు అంటే ఆంధ్ర లో మాదిరిగా బాగా తిరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1200 మంది తెలంగాణలో బలి దానాలు జరిగాయన్నారు. ప్రతి చోట జన సేనకు బలం వుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో పలు పార్టీలు కష్టపడ్డాయన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఆంధ్రలో పోరాటం
‘నిధులు, నియామకాలు, నీళ్లపై తెలంగాణ ఉద్యమం జరిగితే ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బంది పడ్డ నల్లగొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి. తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలి. మోదీ నాయకత్వంలో దేశంలో అందరికీ సమానత్వం అనే నినాదంతో పాలన సాగుతుంది. జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుంది’’ అని సూర్యాపేటలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ వస్తే అవినీతి పోతుందని భావించామన్నారు. గత పాలకులు చేసిన తప్పే మళ్ళీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. లెఫ్ట్ మిత్రులతో మాట్లాడుతూ వుంటానని అన్నారు. లెఫ్ట్ పద్దతిలోనే తను.. జనసేన పని చేస్తుందని అన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply