అన్వేషించండి

TS CEO Vikas Raj: రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో వెళ్తున్నారా? ఈసీ రూల్స్ తెలుసుకోండి

Telangana Loksabha Elections 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.

TS Election Code Rules: హైదరాబాద్: ఎన్నికల సంఘం మినహాయింపులతో ఇంటి నుంచి ఓటు వేయనున్న వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడం తెలిసిందే. ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాత మూడు, నాలుగు రోజులకు హోం ఓటింగ్ మొదలుపెడతామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. అత్యవసర సర్వీసులు అనే విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈసీ నిర్ణయించినట్లుగా పోస్టల్ ఓటింగ్ అవకాశం కల్పించారు.

ఎన్నికల కోడ్ ఉంది జాగ్రత్త 
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లకూడదని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఒకవేళ అంతకుమించి నగదు వాళ్లు తీసుకెళ్తున్నట్లయితే అందుకు సంబంధించిన డాక్యమెంట్స్, ఇతర పత్రాలు వెంట తీసుకెళ్లాలని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్ ఉంది. నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ లో వెబ్ ద్వారా, కాల్ సెంటర్ 1950కి కాల్ చేసి ఫిర్యా చేయవచ్చునని తెలిపారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాలో కంయిట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్, హోమ్ ఓటింగ్ 
పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) వద్ద ఉంటుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ గతంలో తరహాలోనే చంచల్ గూడలో చేస్తారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో 2.09 లక్షల మంది పోస్టల్, హోమ్ ఓటింగ్ జరిగిందని వికాస్ రాజ్ తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్, డీవో, పోలీస్ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈఆర్వో, ఏఈఆర్వో, ఈవీఎం మోడల్ ఆఫీసర్లకు సాఫ్ట్ వేర్ వాళ్లతో ట్రైనింగ్ ఇప్పించామని తెలిపారు. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని.. 57000 బీయూలు, 44,500 కంట్రోల్ యూనిట్, 48 వేల వీవీ ప్యాట్ మేషీన్ల అవసరం కాగా, తమ వద్ద అన్ని ఉన్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక ఉందని, దానికి కావాల్సిన బీయూలు, వీవీప్యాట్, సీయూలు 500 చొప్పున సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget