అన్వేషించండి

Telangana Cabinet Meet: నేడు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

Telangana Cabinet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. త్వరలో అమలు చేయాలనుకుంటున్న గ్యారంటీలకు, 15వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీతకి ఆమోదంతెలిపే అవకాశం ఉంది.

Telangana Cabinet meeting will be held on Sunday :  తెలంగాణ మంత్రి వర్గం ఆదివారం సమావేశం అవుతోంది.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టబోయే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. గురువారం మోడీ సర్కార్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయాలూ లేని సంగతి విదితమే. రాష్ట్ర విభజన హామీలు సైతం అటకెక్కాయి.   బడ్జెట్‌ ఆధారంగా, అక్కడ కేటాయింపులపై అంచనా వేసుకుని రూపొందిస్తున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై క్యాబినెట్‌ సీరియస్‌గా చర్చించనుంది.
Telangana Cabinet Meet: నేడు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయాలు

ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు, నిధుల కేటాయింపునకు సంబంధించిన వివరాలను సేకరించిన ఆర్థిక శాఖ వాటిని మంత్రివర్గానికి సమర్పించనుంది. ఆయా వివరాలపై లోతుగా చర్చించిన తర్వాత… ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు తుది రూపు ఎలా ఇవ్వాలనే అంశంపై క్యాబినెట్‌ ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంపు) అమలు చేసిన క్రమంలో మిగిలిన వాటిలో ముఖ్యమైన రెండు అంశాలు .. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వారికి ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పై కూడా సీఎం తన మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు చేయనున్నారు. 

ఈ నెలలోనే రెండు హామీల అమలు                                           

 రెండు హామీల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? లబ్దిదారుల సంఖ్య ఎంత? ఇప్పటి వరకూ ఎన్ని అప్లికేషన్లను పరిశీలించి, పరిష్కరించారనే విషయాలపై ముఖ్యమంత్రి వివరాలను తెలుసుకోనున్నారు. వాటి అమలుకు ఎన్ని నిధులను కేటాయించాలి..? ఆ సొమ్మును ఏ రూపంలో సమకూర్చుకోవాలనే విషయాలపై కూడా క్యాబినెట్‌ చర్చించనుంది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, కొత్త పాలక మండలిని నియమించిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా మంత్రివర్గం చర్చించనుందని ఉన్నతాధికారులు వివరించారు. అత్యంత కీలకమైన ఈ క్యాబినెట్‌ సమావేశానికి విధిగా హాజరు కావాలంటూ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం మరో వారంలో కేబినెట్ భేటీ                    

ప్రతీసారి బడ్జెట్‌ ప్రతిపాదనకు ఒక రోజు ముందు క్యాబినెట్‌ సమావేశమై… పద్దుకు ఆమోదముద్ర వేయటం ఆనవాయితీ. ఈనెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు సర్కార్‌ సమాయత్తమవుతున్న క్రమంలో… ఆదివారం నిర్వహించబోయే క్యాబినెట్‌ కాకుండా మరో వారం రోజుల్లో ఇంకోసారి మంత్రివర్గం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సర్కారు ఆమోదిస్తుందని సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget