TS Assembly Session 2022 : గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, ప్రభుత్వం సంచలన నిర్ణయం!
TS Assembly Session: మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Budget Session) ప్రారంభం కానున్నాయి. ఇవాళ జరిగిన కీలక సమావేశంలో సీఎం కేసీఆర్(KCR) ఈ నిర్ణయం తీసుకున్నారు.
TS Assembly Session: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ(Telangana)లో బడ్జెట్ సమావేశాల(Budget Session) తేదీలు ఖరారయ్యాయి. అసెంబ్లీ సమావేశాల ఖరారుపై సీఎం కేసీఆర్(CM KCR) ఇవాళ సమావేశం నిర్వహించారు. మార్చి 7వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి7వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ(BAC) సమావేశంలో నిర్ణయిస్తారు.
మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 28, 2022
రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం కోసం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) February 28, 2022
మార్చి 6న కేబినేట్ భేటీ
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖారారు చేసేందుకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేశారు. మార్చి 6న ప్రగతి భవన్‌లో కేబినేట్(Cabinet) సమావేశమై 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. మార్చి 7న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ 2022-23ను ప్రవేశపెడతారు.
Also Read: AP Budget 2022: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ఎప్పుడంటే?