అన్వేషించండి
Advertisement
Earthquake: సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. గుంటూరు జిల్లాలో కూడా కదలికలు..
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. సూర్యాపేట, గుంటూరు జిల్లాల్లో ఉదయం 7 గంటల నుంచి 8.30 మధ్యలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
సూర్యాపేటలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7 గంటల నుంచి 8.30 మధ్యలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు వెల్లడించారు. భూకంప లేఖినిపై వీటి తీవ్రత 2.3, 2.7, 3 గా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ భూప్రకంపనలు సంభవించినట్లుగా నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్త శ్రీ నగేశ్ ధ్రువీకరించారు. మరోవైపు, గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. మూడు సార్లు భూమి కంపించినట్లుగా స్థానికులు తెలిపారు. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాల్లోనూ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా పులిచింతల సమీపంలో ఇలాంటి ప్రకంపనలు వస్తున్నట్లుగా శ్రీనగేశ్ వెల్లడించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion