అన్వేషించండి

Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో ప్రత్యేక రైళ్లు

Telangana News: రద్దీ దృష్ట్యా తిరుపతికి ద.మ రైల్వే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఈ నెల 26, 26, 27, 28 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Special Trains To Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26, 26, 27, 28 తేదీల్లో స్పెషల్ సర్వీసులు (Special Trains) అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్లు ఇవే

  • సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నెం. 07041) రైలు ఈ నెల 25న (గురువారం) సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
  • తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07042) రైలు ఈ నెల 26న (శుక్రవారం) రాత్రి 07:50 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 09:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్ - తిరుపతి (ట్రైన్ నెం. 02764) రైలు ఈ నెల 27న (శనివారం) సాయంత్రం 06:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 06:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
  • తిరుపతి - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 02763) రైలు ఈ నెల 28న (ఆదివారం) సాయంత్రం 05:15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 05:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలోనే స్టాప్స్

  • రైలు నెంబర్ 07041/07042 సర్వీసులు.. కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలోనే ఆగుతుందని అధికారులు తెలిపారు.
  • రైలు నెంబర్ 02764/02763 సర్వీసులు.. జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలోనే ఆగుతుంది.

అయోధ్యకు సైతం ప్రత్యేక రైళ్లు

అటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా అయోధ్య రామయ్య దర్శనానికి తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి 200 మందికి అయోధ్య రాముడి దర్శనం కల్పించేలా బీజేపీ చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక రైలులో మొత్తం 20 బోగీలు ఉంటాయని, ఒక్కో ట్రైన్‌లో 14 వందల మందికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు 5 రోజుల సమయం పడుతుంది. మొదటగా సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు ఈ నెల 29న (సోమవారం) బయలుదేరనుంది. జనవరి 30న వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు అయోధ్యకు బయల్దేరనుంది. 

ఈ తేదీల్లో ఈ ప్రాంతాల నుంచి

జనవరి 31న హైదరాబాద్‌ ప్రయాణికుల రైలు, ఫిబ్రవరి 1న కరీంనగర్‌, ఫిబ్రవరి 2న మల్కాజ్‌గిరి, ఫిబ్రవరి 3న ఖమ్మం, ఫిబ్రవరి 5న చేవెళ్ల, ఫిబ్రవరి 6న పెద్దపల్లి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌,  ఫిబ్రవరి 8న అదిలాబాద్‌, ఫిబ్రవరి 9న మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 10 మహబూబ్‌బాద్‌, ఫిబ్రవరి 11న మెదక్‌, ఫిబ్రవరి 12న భువనగిరి, ఫిబ్రవరి 13న నాగర్‌ కర్నూల్‌, ఫిబ్రవరి 14న నల్లగొండ, ఫిబ్రవరి 15న జహీరాబాద్‌ ప్రయాణికుల రైళ్లు బయలుదేరుతాయి. సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, మల్కాజ్‌ గిరి, మెదక్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల ప్రయాణీకుల రైళ్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరతాయి. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబ్‌ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి బీజేపీ నేతలు తెలిపారు.

Also Read: Telangana News: నకిలీ మందుల విక్రయాలపై ఉక్కుపాదం - సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫిర్యాదు చేయాలన్న డీజీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
Embed widget