అన్వేషించండి

Telangana News: నకిలీ మందుల విక్రయాలపై ఉక్కుపాదం - సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫిర్యాదు చేయాలన్న డీజీ

Fake Medicines: నకిలీ మెడిసిన్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి సూచించారు. అలాంటి వాటి సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.

Drug Control dg Comments: మెడికల్ షాపు నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మెడిసిన్స్ విక్రయించాలని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి (Kamalasan Reddy) స్ఫష్టం చేశారు. తెలంగాణలో (Telangana) డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ పక్కాగా అమలు చేస్తున్నామని.. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడడం తమ బాధ్యతని చెప్పారు. దేశంలో పలు చోట్ల నకిలీ మెడిసిన్స్ తయారు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించామని.. గత 6 నెలల్లో అలాంటి వాటిపై నిఘా పెంచామని చెప్పారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నకిలీ మెడిసిన్ ఇంజక్షన్స్ సీజ్ చేశామని అన్నారు.

ప్రత్యేక వెబ్ సైట్

ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్, ఏజెంట్ల ద్వారా నకిలీ మెడిసిన్స్ హైదరాబాద్ కు దిగుమతి చేస్తున్నారని డీజీ వివరించారు. రాష్ట్రంలో 42 వేల మందుల షాపులు ఉన్నాయని.. నకిలీ మందులు తక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని షాపులపైనా ప్రత్యేక నిఘా ఉంచామని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రజలకు మెడిసిన్స్ విక్రయించాలని స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు రవాణా ద్వారా కొరియర్ చేస్తోన్న ముఠాలను పట్టుకున్నామని.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ కు సంబంధించి ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించినట్లు పేర్కొన్నారు.

ప్రజలకు సూచన

ప్రజలు నకిలీ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడైనా అలాంటి మెడిసిన్స్ గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీజీ సూచించారు. తక్కువ ధరకే మందులు ఇస్తున్నారని.. డిస్కౌంట్ల పేరుతో మోసపోవద్దని చెప్పారు. నకిలీ ఔషధాలపై 1800-599-6969 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Also Read: Karimnagar Politics: కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎవరికి? ఈసారీ త్రిముఖ పోటీనే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
Embed widget