Singareni Strike: కేంద్రం నిర్ణయంపై ఆగ్రహం.. సింగరేణిలో సమ్మెకు కార్మికులు సిద్దం
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి.
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపె కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. దీనిలో భాగంగానే డిసెంబర్ 9, 10 తేదీల్లో సింగరేణిలో సమ్మెకు పిలుపునిచ్చాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, దీనిలో భాగంగా బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని, దీనివల్ల సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందంటూ సింగరేణిలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు బొగ్గు బ్లాక్‌లు సింగరేణి సంస్థ పరిధిలో ఉండటం గమనార్హం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సత్తుపల్లి, కోయగూడెంలలో విస్తరించి ఉన్న ఈ రెండు బొగ్గుబ్లాక్‌లతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని రెండు బ్లాక్‌లను సైతం ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే దీనిని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ సంఘాలన్నీ ఒక్కటై సమ్మెబాట పట్టాయి. ఈ సమ్మెకు బీజేపీ అనుబంద సంఘమైన భారతీయ జనాతా పార్టీ అనుబంద సంఘమైన బీఎంఎస్ మినహా మిగిలిన కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.
Also Read: Malladi Vasu Flexies: ఏపీలో సంచలనంగా మారిన TRS నేత మల్లాది వాసు ఫ్లెక్సీలు.. దీని వెనుక కథేంటి?
సింగరేణికి నాలుగు బ్లాక్‌లు కీలకమే..
ఒకప్పుడు సుమారు లక్షకు పైగా కార్మికులు ఉన్న సింగరేణి సంస్థలో ఇప్పుడు వారి సంఖ్య కేవలం 40 వేలకు చేరుకుందని, ఇలా ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్‌లను అప్పగిస్తూ వెళ్తే సింగరేణి సంస్థలో పర్మనెంట్ కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి సింగరేణి సంస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సింగరేణిలో అత్యధిక బొగ్గు నిక్షేపాలు కలిగిన ఈ బ్లాక్‌లను ప్రైవేట్ పరం చేస్తే భవిష్యత్‌లో సింగరేణికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. నాణ్యమైన బొగ్గు కలిగిన ఈ బ్లాక్‌లను కేంద్రం ప్రైవేటీకరిస్తే సింగరేణికి భవిష్యత్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఎంఎస్ మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునివ్వడంతో 48 గంటలపాటు నిర్వహించనున్న సమ్మె విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. యాజమాన్యం మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దీనికి సింగరేణి సంస్థతో ఎటువంటి సంబంధం లేదని, కార్మికులు సమ్మెలో పాల్గొనవద్దని కోరుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బొగ్గుగనుల వద్ద ఇప్పటికే కార్మిక సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసి సమ్మె విజయవంతానికి కషి చేస్తున్నాయి. బొగ్గు బ్లాక్‌లను ప్రై వేటీకరించవద్దని, ఎంతో అనుభవం కలిగిన సింగరేణి సంస్థకే వాటిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు, సంస్థను ప్రై వేటీకరణ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. కార్మిక సంఘాల పిలుపుతో కార్మికులు సైతం సమ్మెకు సై అంటున్నారు.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. బలహీనపడిన జవాద్ తుపాను.. ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఒడిశా, బెంగాల్‌లో కుంభవృష్టి
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!