News
News
X

Minister Harish Rao : గౌరవెల్లి ప్రాజెక్టును 45 రోజుల్లో ప్రారంభిస్తాం, పనులు అడ్డుకుంటే గుణపాఠం తప్పదు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : కాంగ్రెస్ టైంలో వ్యవసాయం అంటే చింత, కేసీఆప్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

FOLLOW US: 
Share:

Minister Harish Rao : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అంతకుముందు నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగేళ్ల పాలనలో ఒక్క రూపాయి పనిచేయలేదని అంటున్నారని, గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనుల్లో 10 కిలోమీటర్ల పనికిగాను 9 కిలోమీటర్ల 700 మీటర్ల పనిపూర్తయిందని చెప్పారు. మిగిలిన 300 మీటర్ల పనిని 45 రోజుల్లో పూర్తి  చేయిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అదనంగా 86 కోట్ల 97 లక్షల రూపాయలను ప్రత్యేక జీవో ఇచ్చి మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పండుగ వాతావరణంలో గౌరవెల్లి ప్రాజెక్టును 45 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. 

 ఇళ్లు కట్టుకునే వాళ్లకు ఆర్థికసాయం

హుస్నాబాద్ గడ్డమీద పుట్టిన వాళ్లు గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకొరని, ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే తగిన గుణపాఠం తప్పదన్నారు మంత్రి హరీశ్ రావు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం అంటే చింత, కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే నిశ్చింత అని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, తెలంగాణలో రెట్టింపు వృద్ధిరేటు 8 శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా రైతుబంధు రైతుల సంఖ్య రెట్టింపు చేసి ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలను రైతుల సంఖ్యను తగ్గించి ఇస్తోందని ఎద్దేవా చేశారు. ప్రతి రాష్ట్రంలోని ప్రజలు, రైతులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు పెంచుతా, కూల్చుత అంటున్నారని, తెలంగాణ ప్రభుత్వంపై నిందలు, అనుమానాలు సృష్టిస్తున్నారన్నారన్నారు. నిందలు పెట్టి కూల్చుతామంటున్న కాంగ్రెస్, బీజేపీలు కావాలో, నిలబెట్టే కేసీఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. వచ్చే ఉగాదిన గర్భిణీల కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభిస్తామని, దాని కోసం 250 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అతి త్వరలో ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు.  గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తూనే ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామన్నారు. 

గౌరవెల్లి నిర్వాసితులు అరెస్టు 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలవడానికి వచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసిత యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వారిని వదిలిపెట్టినా ఇంటికి వెళ్లకుండా స్టేషన్ ముందు బైఠాయించి యువతులు ఆందోళన చేపట్టారు. తమను మహిళా పోలీసులు అకారణంగా కొట్టారని, మంత్రిని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వస్తే కొడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు నచ్చ చెప్పడంతో వెళ్లిపోయారు. వెళ్లిపోయే క్రమంలో ఓ యువతి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. 

Published at : 25 Feb 2023 09:13 PM (IST) Tags: BJP CONGRESS Minister Harish Rao Siddipet CM KCR Gouravelli project

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

Minister Errabelli : పేపర్ లీక్ పై పిచ్చి పిచ్చి ఆరోపణలు, దమ్ముంటే నిరూపించండి - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!