By: ABP Desam | Updated at : 07 Jan 2022 06:32 PM (IST)
జీవితం తెలంగాణతో నే ముడి పడి ఉందన్న షర్మిల
ఏపీలో పార్టీ పెట్టే అంశంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి స్పందించారు. వైఎస్ఆర్‌ను ప్రేమించే తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పెట్టానని.. తన జీవితం ఇక్కడే ముడిపడి ఉందన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని గత వారం షర్మిల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఏపీలోనూ ఆమె పార్టీ పెట్టబోతోందని ఎక్కువ మంది నమ్మడం ప్రారంభించారు. ఈ క్రమంలో షర్మిల ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
ఇవాళ అధికారంలో ఉన్న వారు .. తాము ఎప్పటికీ అధికారంలో ఉంటామని అనుకోకూడదని.. అలాగే అధికారంలో లేని వారు.. అధికారంలోకి రారని అనుకోకూడదని షర్మిల వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తాను ఏపీలో పార్టీ పెడుతున్నాన్న ప్రచారం వల్ల తెలంగాణలో సీరియస్ నెస్ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నందువల్ల షర్మిల తాజా ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే తన జీవితం ఇక్కడే ముడి పడి ఉందని ఆమె స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారంటున్నారు.
అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించడం ద్వారా షర్మిల మరో చాయిస్‌ను సృష్టించుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో గొప్పగా ప్రజాదరణ లభించకపోయినా ... మరో వ్యక్తిగత కారణం అయినా లేకపోతే ఏపీలో ఎక్కువ ఆదరణ లభిస్తుందని అనిపించినా.. షర్మిల ఏపీలో పార్టీ పెట్టవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సోదరుడు జగన్‌తో విబేధాల కారణంగా ఆమె ఏపీలోనూ రాజకీయం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై సీరియస్ నెస్ తగ్గకుండా కాపాడుకునేలా .. అదే సమయంలో ఏపీలో పార్టీ పెట్టే అంశాన్ని రూల్ అవుట్ చేస్తూ.. చేయననట్లు ప్రకటన చేయడం ద్వారా షర్మిల అచ్చమైన రాజకీయ నేత తరహాలో ప్రకటన చేశారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!
Breaking News Live Telugu Updates: రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ, హైకోర్టులో మూసుకున్న దారులు! సుప్రీంలో పిటిషన్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Revanth Reddy: ప్రగతి భవన్‌ను పేల్చేసినా ఏం కాదు, దుమారం రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు - BRS ఆందోళన
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?
Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?
Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!