(Source: ECI/ABP News/ABP Majha)
Sharmila : ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు షర్మిల - శనివారం కాంగ్రెస్‌లో విలీనంపై కీలక ప్రకటన చేసే చాన్స్ !
వైఎస్ వర్థంతి సందర్భంగా షర్మిల ఇడుపులపాయకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రెండో తేదీన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక రోజు ముందే ఇడుపులపాయకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆమెతో పాటు తల్లి విజయమ్మ ఇతర బంధువులు వచ్చారు. నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. రెండో తేదీన ఉదయం వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం గురించి చర్చించారు.
వైఎస్ఆర్ ప్రతి జయంతికి, వర్థంతికి కుటుంబం అంతా కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే జగన్, షర్మిలకు మధ్య విబేధాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి విడివిడిగా నివాళులు అర్పించి వెళ్తున్నారు. ఈ సారి కూడా షర్మిల ఉదయమే నివాళులు అర్పించి వెళ్తారని.. జగన్ విడిగా వచ్చి వెళ్తారని అంటున్నరు. రేపు రాత్రికే జగన్ లండన్ పయనమమవుతున్నారు.
మరో వైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేయనున్నారు. షర్మిల పార్టీ విలీనం లేదా పొత్తుల అంశంపై ఫైనల్ చర్చలు జరిగాయి. గతంలో ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చాలాసార్లు మంతనాలు జరిపారు. ఈసారి డైరెక్టుగా సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలతో పాటు పార్టీ విలీనం, పొత్తులపై అంశాలపై చర్చించారు. నిర్ణయం ఏమిటన్నదది షర్మిల ప్రకటించ ేఅవకాశం ఉంది.
కాంగ్రెస్ నుంచి షర్మిలకు కొన్ని కండీషన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ విలీనం చేస్తే తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పార్టీ అవసరాల దృష్ట్యా పని చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ షర్మిలకు కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు వైఎస్ షర్మిల అంగీకరించలేదని సమాచారం. తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోనని ముందే స్పష్టం చేసినట్లు వార్తలొస్తున్నాయి. కేవలం తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని షర్మిల.. కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని తెలుస్తోంది.
షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనాన్ని తెలంగాణ పీసీసీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠతో పాటు ఆసక్తిని పెంచింది. మరోవైపు... షర్మిల ఢిల్లీ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ టూర్ పూర్తిగా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.