అన్వేషించండి

Revanth Reddy: రేవంత్‌ కాకుండా మరో ఐదారుగురే - పూర్తి స్థాయి కేబినెట్ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ?

Revanth Reddy sworn in : గురువారం రేవంత్‌తో పాటు మరో ఐదారుగురు మంత్రులు మాత్రమే ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

 

Revanth Reddy Cabinet :  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణం చేయబోతున్నారు. పూర్తి స్థాయి కేబినెట్ ప్రమాణం జరుగుతుందని నిన్నటి  వరకూ అనుకున్నారు కానీ.. ఇప్పుడు సీనియర్ నేతలు ఆరుగురితో మత్రమే ప్రమాణం చేయించబోతున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాకుండా మరో ఐదారుగురు మాత్రమే ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందులో ఒక డిప్యూటీ  సీఎం ఉండే అవకాశం ఉంది. స్పీకర్ గా సీనియర్ నేతను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అ పదవిని తీసుకునేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి పేర్లు స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నాయి. అయితే వారు మాత్రం తమకు వద్దే వద్దంటున్నారు. అందుకే స్పీకర్ పదవి గురించి తేలిన తర్వాత మిగతా కెబినెట్ గురించి ఆలోచన చేసే ఉందని చెబుతున్నారు.                          
 
రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణం చేసే వారిలో సతక్క, భట్టి విక్రమార్క, ఉత్తమ్ లేదా కోమటిరెడ్డి  ఉంటారని అంటున్నారు. మంత్రి పదవుల కోసం చాలా మంది ఢిల్లీలో విస్తృతమైన లాబీయింగ్ చేసుకుంటున్నారు. భట్టి విక్రమార్క తిరిగి ఇంకా హైదరాబాద్ కు రాలేదు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అందర్నీ ఆహ్వానించి హైదరాబాద్ కు వచ్చేశారు కానీ ఆయన మాత్రం హైకమాండ్ పెద్దలతో మాట్లాడుతున్నారు. తాము అసంతృప్తికి గురయ్యామన్న సమాచారన్ని మీడియాకు లీక్ చేశారు కానీ హైకమాండ్ పట్టించుకోలేదు . దీంతో వారు కనీసం తమకు కీలక మంత్రిత్వ శాఖలు అియనా ఇప్పించాలని హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.                 

పార్టీకి విధేయంగా  పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఓడిపోయిన కొంత మందికి ఎమ్మెల్సీ ఇచ్చి అయినా పదవులు కల్పించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పరాజయం పాలయ్యారు. వీరిలో ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి సపోర్ట్ గా ఉంటున్న షబ్బీర్ అలీకి చాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ సారి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారన్న అభిప్రాయం ఉండటంతో..  మొదటి విడతలోనే ప్రమాణం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు.                     

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ.వేణుగోపాల్, తదితర నేతలను రావాల్సిందిగా నేతలను రేవంత్ ఆహ్వానించారు. ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీ నేతలను, ప్రాముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.  ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీఎంలను కూడా రేవంత్ ఆహ్వానించారు.  అలాగే సినీ ప్రముఖులతో పాటు మేధావులను కూడా పిలుస్తున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆరు గ్యారంటీల అమలుపై మొదటి సంతకం చేసే అవకాశం ఉంది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget