Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎలక్షన్

Rajya Sabha Elections 2022: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.

FOLLOW US: 

Rajya Sabha Biennial Eelections 2022 notification: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇటీవల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల ప్రక్రియలో భాగంగా పదవీకాలం పూర్తి కానున్న యాభై ఏడు రాజ్యసభ స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల.

రాష్ట్రం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవికాలం యుగియనుంది. వారిస్థానాల్లో కొత్తవారి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మే 31 తేదీ వరకు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుంది. జూన్ ఒకటో తేదీన రాజ్యసభ స్థానాల నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్‌ మూడో తేదీతో ముగియనుంది. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, సాయంత్రం 5 గంటలకు కౌంటి టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. 

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
ఎన్నికలకు నోటిఫికేషన్ మే 24
నామినేషన్ల ప్రారంభం మే 24, 2022
నామినేషన్ల తుది గడువు మే 31, 2022
నామినేషన్ల పరిశీలన జూన్ 1, 2022
నామినేషన్ల ఉపసంహరణ జూన్ 3, 2022
రాజ్యసభ ఎన్నికలు  జూన్ 10, 2022 

దేశవ్యాప్తంగా 57 స్థానాలకు పోలింగ్ 
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 57 మంది రాజ్యసభ ఎంపీ పదవీకాలం జూన్ 21 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా ముగియనుంది. వీటిలో అత్యధికంగా యూపీ నుంచి 11 స్థానాలకు, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి 6 స్థానాల సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. ఏపీ నుంచి 4 స్థానాలు, తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. పదవీకాలం పూర్తయ్యేవారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోని తదితర నేతల పదవీకాలం త్వరలో పూర్తికానుంది. ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీలు టీజీ వెంకటేష్, వై సుజనా చౌదరి, సురేష్ ప్రభు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒడిశా నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న నెక్కంటి భాస్కర్‌రావు పదవీకాలం సైతం జులై 1వ తేదీన ముగియనుంది. 

Also Read: TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే 

Also Read: TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్‌ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?

Published at : 24 May 2022 11:48 AM (IST) Tags: telangana Rajya Sabha Rajya Sabha Elections 2022 Rajya Sabha elections Rajya Sabha Notification

సంబంధిత కథనాలు

Political Cheating :   పార్టీలో చేరితే చాలు ఇల్లు, ఫ్లాట్లట - తీరా చేరిన తర్వాత !

Political Cheating : పార్టీలో చేరితే చాలు ఇల్లు, ఫ్లాట్లట - తీరా చేరిన తర్వాత !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !

Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం

Breaking News Live Telugu Updates: ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం

Crime News Cheating : కోటి లాటరి అని ఆశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది - ఈ మోసగాళ్లు చాలా డేంజర్ !

Crime News Cheating : కోటి లాటరి అని ఆశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోయింది - ఈ మోసగాళ్లు చాలా డేంజర్ !

Nizamabad News: మాస్క్‌ ఒక్కటే క్లూ- పోలీసులకు సవాల్‌గా నిజామాబాద్‌ బ్యాంక్‌ దోపిడీ కేసు

Nizamabad News: మాస్క్‌ ఒక్కటే క్లూ-  పోలీసులకు సవాల్‌గా నిజామాబాద్‌ బ్యాంక్‌ దోపిడీ కేసు

టాప్ స్టోరీస్

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు

Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

Twitter Moves Court :  ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !

IND vs ENG 5th Test: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

IND vs ENG 5th Test: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'

Shaitan Web Series: ఓటీటీ కోసం 'యాత్ర' దర్శకుడి వెబ్ సిరీస్ - 'సైతాన్'