TS Eamcet Exams: వాయిదా పడిన ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఈనెల 30, 31న నిర్వహణ!
TS Eamcet Exams:తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
TS Eamcet Exams: తెలంగాణ భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంసెట ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శాఖ వెల్లడించింది. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలను ఈనెల 30, 31న నిర్వహించబోతున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు. అలాగే ఆగస్టు 1వ తేదీన ఈసెట్, ఆగస్టు 2వ తేదీ నుంచి 5 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. సంబంధిత వెబ్ సైట్ ల నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
భారీ వర్షాల కారణంగానే వాయిదా..
కాగా.. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించింది. జులై 13న నిర్వహించాల్సిన ఈసెట్ను అధికారులు వాయిదా వేశారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపారు. అయితే జులై 14, 15న భఆరీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో... రాష్ట్ర ప్రభుత్వం ఆ సెలవులను మరోసారి పొడగించింది. మరో మూడు రోజుల పాటు పాఠశాలలు, విద్యా సంస్థలు మూసే ఉంచాలని తెలిపింది. ఫలితంగా ఈ రెండు రోజుల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రి కల్చర్ పరీక్షను విద్యా మండలి వాయిదా వేసింది. కాగా 18వ తేదీ నుంచి 20 తేదీ వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా నిర్వహిస్తున్నారు.
వాయిదా పడిన ప్రవేశ పరీశ్రలు షెడ్యూల్..
- ఈనెల 30, 31 వ తేదీల్లో అగ్రికల్చర్
- ఆగస్టు 1న ఈసెట్
- గస్టు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్
ఒక్క నిమిషం నిబంధనలో సడలింపు..
అయితే ఎంసెట్ పరీక్షలకు ఉన్న ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనకు సడలింపు ఇచ్చారు. వర్షాలు పడుతున్న సమయంలో రోడ్లు దెబ్బతిని, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు సరైన కారణాన్ని కచ్చితంగా చూపించాలని చెప్తున్నారు. అయితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో పూట పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఇంజినీరింగ్ కు లక్షా 72 వేల 241 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో 89, ఏపీలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు..
మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్- 2022లో వచ్చిన మార్కులతోనే విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకును కేటాయిస్తారు. ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత (Intermediate) సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో చేరేందుకు ఎంసెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ఎంసెట్ (EAMCET) పరీక్షను జేఎన్‌టీయూ, హైదరాబాద్ నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్(Engineering Courses) కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు ఇంటర్ లో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోలజీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి.