అన్వేషించండి

Hyderabad Orphan Sisters: ఒకే ఒక్క ఫొటో.. విడిపోయిన ముగ్గురు అనాథ అక్కాచెల్లెల్లను కలిపింది.. అది కూడా ఏళ్ల తర్వాత

చిన్నప్పుడే విడిపోయిన ఒకే తల్లి పిల్లలు.. కలవడమంటే.. సినిమాల్లోనే కదా. కానీ హైదరాబాద్ లో అది నిజమైంది. వాళ్లు కలుసుకునేందుకు ఒకే ఒక్క ఫొటోనే కారణం.

 

రక్త సంబంధం.. ఏదో కారణంతో విడిపోయి ఎక్కడున్నారో.. తెలియకుండా ఉంటే.. మళ్లీ కలుసుకోవడం అంటే ఇక కలే. మనం చూసే సినిమాల్లో మాత్రం.. ఏదోలా కలుసుకుంటారు. నిజ జీవితంలో కలుసుకోవాలంటే కష్టమే. కానీ హైదరాబాద్ లో మాత్రం.. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వాళ్ల జీవితాల్లో ఎన్నో విషాదాలు.  సినిమాను తలపించే ఈ నిజమైన కథ.. చదవండి. 

ఆ ముగ్గురు బాలికలది అదృష్టం.. అనాలో.. లేక.. కుటుంబాన్ని కోల్పోయిన ముగ్గురు ఆడ పిల్లలు ఎలా బతుకుతారో జాలి పడాలో అర్థంకాని పరిస్థితి. ఇది అద్భుతం కావొచ్చు. లేకుంటే సినిమాల్లో వచ్చే.. ట్విస్ట్ లాంటిది కావొచ్చు. హైదరాబాద్ లోని ఓ అనాథ ఆశ్రమంలో ఇద్దరు అనాథ అక్కాచెల్లెలు ఉంటున్నారు. ఒకరి వయసు 12, మరొకరి వయసు 14. ఓ రోజు ఆశ్రమంలో సైన్స్ ఫేర్ సంబంధించిన ఫొటోలను.. చూస్తున్నారు ఆ బాలికలు. ఆ ఫొటోల్లో వాళ్ల చెల్లెను పోలి ఉన్న చిన్నారి కనిపించింది.  ఈ విషయాన్ని వెళ్లి అనాథ ఆశ్రమంలో అధికారులకు చెప్పారు. అక్కడ నుంచి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది..

ముగ్గురు అనాథ ఆడపిల్లలు మూడేళ్ల కిందటి వరకూ కూకట్ పల్లిలో వాళ్ల నాన్న దగ్గర ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత చిన్న పాపను వాళ్ల అమ్మమ్మ  హైదరాబాద్ తీసుకెళ్లింది. మిగతా బాలికలు నాన్నతోనే ఉండేవారు. మూడేళ్ల కిందట వాళ్ల నాన్న చనిపోయారు. మరోవైపు చిన్నపాపను తీసుకెళ్లిన అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇటు ఇద్దరు.. అటు ఆ చిన్నారి ముగ్గురు అనాథలయ్యారు. కొన్ని రోజులు విధుల్లో తిరిగినట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు ఇద్దరు బాలికలను అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఈ బాలికలకు తమ చెల్లి గురించి ఎలాంటి క్లూ లేదు. చిన్నప్పుడు చూసిన గుర్తు మాత్రమే. 

ఆ చిన్నపాపను కూడా ఎవరో అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఓ రోజు సైన్స్ ఫేయిర్ నుంచి వచ్చిన ఫోటోలను చూస్తుండగా.. తమ చెల్లిని గుర్తుపట్టారు ఇద్దరు బాలికలు. ఇదే విషయాన్ని అనాథ ఆశ్రమం అధికారులకు చెప్పారు. హైదరాబాద్‌ లోని ఉమెన్ డెవలప్‌ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌ మెంట్ అధికారులు.. ముగ్గురు అక్కాచెల్లెళ్లకు డీఎన్ఏ టెస్ట్ చేసి వారిని కలిపారు. అనంతరం వారిని అమీర్‌పేట్‌లోని గర్ల్స్ చిల్డ్రన్ హోమ్ తరలించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు అక్కా చెల్లెలు ఒకే గూటికి చేరారు. అలా ఒక్క ఫొటో వారిని కలిపింది.
 
జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఏకేశ్వర్ రావు ఏమన్నారంటే.. అనాథ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని.. చెప్పారు. ఈ సంవత్సరం జరిగిన సైన్స్ ఫేయిర్ కి సంబంధించిన ఫోటో చూసి.. ఆ పిల్లలు కలవడం ఆనందంగా ఉందన్నారు.

 

Also Read: World Lions Day: చిన్నారులు టాలెంట్ చూపారు.. సింహాలను అచ్చంగా దించేశారు...

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget