అన్వేషించండి

Morning Tops News: కర్నూలులో హైకోర్టు బెంచ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు- మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10 Headlines Today: 
 
1. కర్నూలులో హైకోర్టు బెంచ్
కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జూనియర్‌ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయ విధానం ఉండాలని చంద్రబాబు అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
2. వరద బాధితులకు ఆర్థిక సాయం పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11 వేలకు బదులుగా రూ.25వేల ఆర్థిక సాయం అందుతుంది. దుకాణాలకు రూ.25వేలు, వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ.25వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
3. ప్రతి నెలా జాబ్‌ మేళాకు క్యాలెండర్‌: లోకేశ్‌
రాష్ట్రంలోని యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అందుకోసమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
4. శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి.. టీటీడీ విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న వేళ పవిత్ర హోమాన్ని నిర్వహించిన టీటీడీ.. ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.. 'ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ' మంత్రాలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందాలని సూచించింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలు నిర్వహించింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ వేసిన పిటిషన్‌.. 10 మంది బీఆర్ఎస్ MLAలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసేలా చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS తరపున గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన MLAలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. 10 మంది BRS MLAలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జరీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
6. హై అలర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
7.దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 274 మంది మృతి
హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు త్రీవతరం చేసింది. నేడు ఒక్కరోజే 300లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 274 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో మహిళలు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇజ్రాయెల్‌ సేనలు భీకర దాడులు ముమ్మరం చేశాయని లెబనాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. .పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
8. అదిరిపోయిన టీ 20 ప్రపంచకప్ థీమ్ సాంగ్
మహిళల టీ 20 ప్రపంచకప్ ఆరంభానికి సర్వం సన్నద్ధం అవుతున్న వేళ.. ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. 'వాటెవర్ ఇట్ టేక్స్' పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్.. ఆటగాళ్ల భావోద్వేగాలను ఆవిష్కరించింది. ఒక నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్.. విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మికే మెక్‌క్లియరీ, కంపోజర్ పార్థ్ పరేఖ్ ఈ పాటను రూపొందించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ ఫీవర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ ఫీవర్ షురూ అయ్యింది. ఈనెల 27న మూవీ రిలీజ్ కానుండగా పలు థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. HYD ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు సేల్ అయిపోయాయి. మంగళవారం మిగతా థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
10. ఆస్కార్‌కి ‘లాపతా లేడీస్’
బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్‌’ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ఆ మూవీ ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా వెల్లడించింది. కాగా, స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Embed widget